Hyderabad Celebrations : నూతన ఏడాది(New Year) సంబరాలలో మొదలయ్యాయి. దీంతో హైదరాబాదులోని రెస్టారెంట్ల(Restaurants) బయట క్యూ లైన్లు బారులుదీరి కనిపిస్తున్నాయి. ఓ వైపు పార్టీలు, మరోవైపు విందులతో సరదా చేస్తున్న నగర ప్రజల(City People) ఇష్టమైన బిర్యాని(Biryani) సహా మరిన్ని హైదరాబాదీ స్పెషల్ వెరైటీలతో విందలకు రెడీ అయిపోయారు. ప్రత్యేక వంటకాలతో(Special Recipies) రెస్టారెంట్ సైతం ఆకర్షిస్తుండగా.. వాటిని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు(customers) సైతం మంచి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రెస్టారెంట్లు బయట వందల సంఖ్యలో ఆర్డర్ల (Food Orders) కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో సాధారణ రోజుల్లోనే ఫుడ్ డెలివరీ (Food Delivery) బాయ్స్ రెస్టారెంట్లు ముందు వెయిట్ చూస్తూ ఉంటారు. ఇక నగరంలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండడంతో ఆర్డర్ల సంఖ్య భారీగా ఉంది. నగరంలోని ఏ రెస్టారెంట్ దగ్గర చూసిన పెద్ద సంఖ్యలో ఫుడ్ డెలివరీ యాప్స్ సంబంధించిన డెలివరీ బాయ్స్ వేచి చూస్తూ కనిపిస్తున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలు యువత (Youth Enjoy) ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉండగా.. వారికి ఇష్టమైన వంటకాలు ఆస్వాదిస్తూ నూతన ఏడాదిని గ్రాండ్ గా వెలుకమ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే.. బంధువులు, స్నేహితులు ,కుటుంబ సభ్యులతో పార్టీలు ప్లాన్ చేశారు. అయిన వాళ్ల మధ్య న్యూ ఇయర్ కు వెల్ కమ్ చేప్పేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సిటీ యూత్ కి ఇష్టమైన, కావాల్సిన వంటకాల్ని అందించేందుకు హైదరాబాదులోని రెస్టారెంట్లు ముందు నుంచే ప్లాన్లు చేశాయి. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా.. అనేక రకాలుగా వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ తో నోరూరించేలా వంటకాల్ని సిద్ధం చేసేసాయి. వీటిని రెస్టారెంట్ల నుంచి నేరుగా కస్టమర్ల వద్దకు తీసుకెళ్లేందుకు ఫుడ్ డెలివరీ యాప్స్ నిరంతరంగా పనిచేస్తున్నాయి. దాంతో.. అందరూ పార్టీ మూడ్ లో సరదాగా ఎంజాయ్ చేస్తుండగా, ఫుడ్ డెలివరీ యాప్స్ బాయ్స్ మాత్రమే వేడుక సమయంలో జీవనోపాధీ కోసం డెలివరీలు చేస్తూ న్యూ ఇయర్ ని గడిపేస్తున్నారు.
హైదరాబాదులోని అనేక రెస్టారెంట్ల ముందు క్యూ లైన్ లో నిలుచున్న జొమాటో, స్విగ్గి సహా అనేక ఫుడ్ డెలివరీ యాప్స్ బాయ్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగరంలో పెరుగుతున్న ఫుడ్ డెలివరీ యాప్ ల వినియోగానికి.. ఈ దృశ్యాలు ఓ సంకేతంగా కనిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం న్యూ ఇయర్ కారణంగా ఇంత రద్దు ఉన్నా.. సాధారణ రోజుల్లోనూ ఇదే తరహాలో రద్దీ ఉంటున్నట్లు హోటల్ వ్యాపారుల సైతం అంగీకరిస్తున్నారు.
Also Read : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైదరాబాద్ గోల్డ్ మ్యాన్.. బంగారం చూసి అంతా షాక్
మొత్తంగా.. హైదరాబాద్ నగరం న్యూఇయర్ వేడుకల్లో మునిగిపోయింది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అంతా..నోరూరించే వంటల్ని దగ్గర పెట్టకుని, న్యూ ఇయర్ ని వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు. వారి సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు ఫుడ్ డెలివరీ బాయ్స్.. నిరంతరం పనిచేస్తూ ఫుడ్ ఆర్డర్లు డెలివరీ చేస్తున్నారు.