BigTV English

Food Poision : బడుల్లో ఆగని ఆహార కల్తీలు.. విద్యార్థుల ఆరోగ్యాలతో పరాచికాలు..

Food Poision : బడుల్లో ఆగని ఆహార కల్తీలు.. విద్యార్థుల ఆరోగ్యాలతో పరాచికాలు..

Food Poision : రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ మూల ప్రభుత్వ బడుల్లో ఆహార కల్తీ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కళాశాలలో భోజనం చేసిన తర్వాత విద్యార్థులంతా వరుసగా అనారోగ్యానికి గురయ్యారు.  ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనట్లు కాలేజీ వర్గాలు వెల్లడించాయి.


కల్తీ ఆహారం తీసుకున్న విద్యార్థిణులంతా వరుసగా వాంతులు, విరోచనాలు, తల తిరగటం వంటి సమస్యలతో బాధపడగా.. వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినీలను పరిశీలించిన వైద్యులు.. వారికి వెంటనే సెలైన్లు, ఔషధాలు అందించారు. విద్యార్థిణులు అస్వస్థతకు గురికావడానికి కారణం ఆహార కల్తీగా వైద్యులు తేల్చారు.

విద్యార్థిణుల ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న విద్యాశాఖ అధికారులు.. అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఇటీవలే నారాయణపేట జిల్లాలోని ధన్వాడ బాలుర పాఠశాలలో ఆహార కల్తీ జరిగింది. ఈ ఘటన మర్చిపోకముందే మరోసారి ధర్మపురి పట్టణంలో ఆహార కల్తీ జరగటంతో.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు రావట్లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి


ప్రభుత్వ బడుల్లో ఆహార కల్తీ, నాణ్యమైన ఆహారం అందించట్లేదనే విషయమై ఏళ్లుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ.. నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన దానికంటే ఎక్కువగానే తెలంగాణ ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచింది.

తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో డైట్ చార్జీలతో పాటు కాస్మోటిక్ చార్జీలను సైతం భారీగా పెంచింది. అన్ని రకాల గురుకులాలు, వివిధ శాఖలకు చెందిన అనుబంధ హాస్టల్లో పెంచిన చార్జీలను అమలు చేస్తున్నారు. గతంలో 3 నుంచి 7వ తరగతి వరకు రూ. 950 గా ఉన్న డైట్ చార్జీలను ఏకంగా రూ.1,331 కి పెంచారు. అలాగే 8 నుంచి 10వ తరగతి వరకు రూ.1,100 గా ఉన్న డైట్ చార్జీలను రూ.1,540కు పెంచింది తెలంగాణ సర్కార్. ఇదే కొవలో ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1,500 నుంచి 2,100 కు డైట్ ఛార్జీలను పెంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,65,700 మంది హాస్టల్ విద్యార్థులకు పెంచిన చార్జీలను అందిస్తోంది.

విద్యా సంస్థల్లో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించే చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చార్జీలను పెంచింది. ప్రతీ బడిలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

వసతి గృహాలకు, హాస్టళ్లకు నెల చివర్లో ఠంఛన్ గా బిల్లులైతే అందుతున్నాయి కానీ, చాలా హాస్టళ్లు,  పాఠశాలలో విద్యార్థుల భోజనం విషయంలో రాజీ పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం ఆహారం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజింగ్ ఘటనలపై సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది.

Also Read : మీకు ఎన్నికలు కావాలి, ప్రజలు కాదు – కేసీఆర్ పై కాంగ్రెస్ ఎదురుదాడి

ఇటీవల నారాయణపేట లోని ధన్వాడ బాలుర పాఠశాలలో జరిగిన ఘటనపై జిల్లా విద్యాధికారి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రాథమిక విచారణ చేపట్టారు. పిల్లలు అనారోగ్యానికి గురికావడానికి కారణం తెలుసుకుంటున్నారు. ఈ విషయంలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు హెచ్చరించగా, ప్రభుత్వ జిల్లా యంత్రాంగం సైతం ఆ మేరకు చర్లకు ఉపక్రమించింది.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×