Anasuya: ఇండస్ట్రీలో వచ్చినన్ని పుకార్లు ఇంకెక్కడ రావు. హీరోహీరోయిన్లు ఒకసారి కలిసి కనిపిస్తే వారి మధ్య ఎఫైర్ ఉందని చెప్పుకొచ్చేస్తారు. ఇంకొద్దిగా క్లోజ్ గా కనిపిస్తే వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పుకొచ్చేస్తారు. అలా ఇప్పటివరకు చాలామంది జంటలపై పుకార్లు పుట్టుకొచ్చాయి. కేవలం ఇవే కాదు.. ఆ హీరో.. ఈ నాటికీ ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడట.. కారు గిఫ్ట్ ఇచ్చాడట.. సినిమాలో ఆఫర్ కోసం ఆమె ఇది అడిగిందట.. అది అడిగిందట.. ఇలా రకరకాల పుకార్లు వింటూనే ఉంటాం.
ఇక అనసూయ గురించి కూడా ఇలాంటి పుకార్లు వినిపించాయి. అప్పట్లో సోగ్గాడే చిన్ననాయన సమయంలో అక్కినేని నాగార్జున.. అనసూయకు ఆడీ కారు గిఫ్ట్ ఇచ్చాడట అనే పుకారు షికారు చేసింది. తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో ఈ పుకారుకు ఫుల్ స్టాప్ పెట్టింది అనసూయ. యూట్యూబర్ నిఖిల్ పాడ్ కాస్త చేస్తున్న నిఖిల్ తో నాటకాలు అనే షోలో అనసూయ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
ఇక ఇండస్ట్రీలో ఎవరైనా క్యస్టింగ్ కౌచ్ అడిగారా.. ? అన్న ప్రశ్నకు అనసూయ ఎస్ అని చెప్పింది. హీరో, డైరెక్టర్స్ చాలామంది అడిగారని, అదృష్టం కొద్దీ నిర్మాతలు ఇప్పటివరకు అడగలేదని చెప్పింది. ఇంకా అలా నో చెప్పడం వలన చాలా సినిమాలు వదిలేసుకున్నట్లు తెలిపింది. ” ఇండస్ట్రీలోనే ఎందుకు ఇదంతా అంటే.. ఇదొక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఉన్నవారు ఎక్కువ అందంగా ఉంటారు. అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. నాకు 9 వతరగతిలోనే ప్రపోజల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలా నో చెప్పడం వలన నాకు సినిమాలు ఇవ్వనివారు చాలా మంది ఉన్నారు.
అయితే వారికి ఎలా నో చెప్పాలి అనేది కూడా చెప్తాను. ఇది నేను మాత్రమే చేసేది. ఎవరైనా హీరో నన్ను రమ్మని అడిగారు అంటే.. లేదు లేదు అలా నేను చేయను అని ఒక ఫ్రెండ్ గా చెప్తాను. నాకు బంధాల గురించి బాగా తెలుసు. దీన్నే టార్గెట్ గా పెట్టుకోవాలని ఉండదు. అడిగాడు.. నేను నో చెప్పాను ఇక అంతే దాంతో ముగిసిపోయింది. ఆ తరువాత వాళ్లు నార్మల్ గా మాట్లాడతారు నేను నార్మల్ గా మాట్లాడతాను..ఇప్పటికీ వాళ్ళల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు” అని చెప్పుకొచ్చింది.
ఇక ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వస్తాయి. అలాంటివాటివి మీ వరకు వస్తాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ” నేను చాలా సార్లు చూసాను నాకు ఆడీ కారు ఎవరో యాక్టర్ గిఫ్ట్ చేసారట.. నిర్మాత ఒక కారు బహుమతిగా ఇచ్చాడట అని” అనగానే నిఖిల్ నాగ్ సార్ అంటగా అని అనడంతో అనసూయ.. ” నవ్వుతారు నాగ్ సార్ కూడా. నేను, మా ఆయన కష్టపడి, లక్షా పదహారు వేలు EMI కడుతూ.. కోవిడ్ కన్నా ముందే లోన్ ఫినిష్ అయ్యింది. మేము చాలా హార్డ్ వర్క్ మనుషులం. లగ్జరీగా ఉండాలని కోరుకుంటాం. దానికి తగ్గట్టుగానే కష్టపడతాం. అందరిలానే నేను కూడా. ఎవరిదగ్గరకు వెళ్లినా నేను ఇదే చెప్తాను. నా దగ్గర బ్లాక్ మనీ లేదు. తాతముత్తాతల నాకు అవసరం లేదు. నా కష్టార్జితం రూపాయి కూడా నేను వదలను” అని చెప్పుకొచ్చింది.