Muralidhar Rao Arrest: తెలంగాణ నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తం 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొండాపూర్‌లో విల్లా, బంజరాహిల్స్, యూసుఫ్ గూడ, బేగంపేట, కోకాపేటలో ఫ్లాట్లను గుర్తించారు. హైదరాబాద్ శివారులో 11 ఎకరాలు, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో మురళీధర్ రావుకు 6500 గజాల భూమి, జహీరాబాద్ లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఉన్నట్టు మురళీధర్ రావు ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు గుర్తించారు.
అలాగే.. వరంగల్, కోదాడలో నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్లు, హైదరాబాద్, కరీంనగర్ లో భవనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మురళీధర్ రావుకు బెంజ్ తో పాటు మూడు కార్లు కూడా ఉన్నాయని చెప్పారు. భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంక్ నిల్వలు కూడా ఉన్నట్లు గుర్తిచారు.
మురళీధరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు పదవిలో కొనసాగారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.
ALSO READ: Hyderabad: కలెక్టర్ హరిచందన కీలక నిర్ణయం.. ఇకపై స్కూల్ పిల్లలకు ‘యూ’ ఆకారంలో?
ALSO READ: Skeleton Found: హైదరాబాద్‌లో అస్థిపంజరం ఘటన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ.. ఎవరిదంటే?