OTT Movie : బాడీ హారర్, సై-ఫై, ఎమోషనల్ డ్రామా వంటి అంశాలు కలగలిసిన సినిమాలకు థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది. అందులోనూ హాలీవుడ్.. ముఖ్యంగా డేవిడ్ క్రోనెన్‌బెర్గ్ వంటి డైరెక్టర్‌ల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తాయి. 2024లో రిలీజ్ అయిన అలాంటి ఒక డార్క్ హర్రర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. పైగా ఇది డైరెక్టర్ రియల్ లైఫ్ స్టోరీ స్పూర్తితో తీసిన మూవీ
ఈ మూవీ పేరు The Shrouds. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ డేవిడ్ క్రోనెన్‌బెర్గ్ దర్శకత్వంలో, గ్రేవ్‌టెక్ ప్రొడక్షన్స్ అండ్ SBS ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందింది. 2024 మే 20న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. కెనడాలో 2025 ఏప్రిల్ 25న థియేటర్లో రిలీజ్ అయింది. ఫ్రాన్స్‌లో 2025 ఏప్రిల్ 30న, USలో ఇదే ఏడాది న్యూయార్క్ లో ఏప్రిల్ 18న రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ ఓటీటీలలో అందుబాటులో ఉంది. విన్సెంట్ కాసెల్ (కర్ష్), డైయాన్ క్రూగర్ (బెక్కా/మెక్కా), గై పీర్స్ (డాక్టర్ రోరీ జావ్), సాండ్రిన్ హోల్ట్ (డాక్టర్ హోఫ్‌స్ట్రా), ఫెహ్మిడా జాన్‌సన్ (రెబెక్కా), మోసెస్ వెస్ట్ (రెవెన్యూ), ట్రెవర్ కెలీ (డాక్టర్ జెర్రీ ఎక్లర్) తదితరులు ఈ సినిమాలో నటించారు. IMDbలో 5.8 రేటింగ్ ఉన్న ఈ మూవీ TIFF 2024 కెనడా టాప్ 10 లిస్ట్‌లో చేరింది. 2020s బెస్ట్ మూవీలలో 39వ స్థానంలో ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా $12 మిలియన్ బడ్జెట్‌తో తెరకెక్కి $23.7 మిలియన్ కలెక్ట్ చేసింది.
కర్ష్ (విన్సెంట్ కాసెల్) అనే వెల్తీ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ చుట్టూ కథ తిరుగుతుంది. అతను తన భార్య బెక్కా (డైయాన్ క్రూగర్) క్యాన్సర్‌తో మరణించిన తర్వాత తీవ్రమైన దుఖంలో మునిగిపోతాడు. అయితే అదే బాధ నుండి స్ఫూర్తి పొంది, కర్ష్ “గ్రేవ్‌టెక్” అనే రెవల్యూషనరీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తాడు. ఇది మరణించిన వ్యక్తుల శరీరాలను “ష్రౌడ్స్” (కఫన్‌లు) లోపల మానిటర్ చేసి, రియల్ గా బ్రతికి ఉన్నట్టుగా రియల్-టైమ్‌లో చూడగలిగేలా చేసే అద్భుతమైన ప్రయోగం. ఈ టెక్నాలజీ కర్ష్ కంపెనీకి విజయాన్ని తెస్తుంది.
కానీ అతను బెక్కా శరీరాన్ని మానిటర్ చేస్తూ, ఆమె డీకే ప్రాసెస్‌ను ఆబ్సెస్డ్‌గా చూస్తూ ఉంటాడు. దీనివల్ల తన మానసిక స్థితి మరింత డిస్టర్బ్ అవుతుంది. అతను బెక్కా సిస్టర్ మెక్కాతో రిలేషన్‌షిప్‌లో పడతాడు. ఇది అతని బాధ, ఆబ్సెషన్‌ను మరింత కాంప్లికేట్ చేస్తుంది. ఒకరోజు రాత్రి, గ్రేవ్‌టెక్ సెమటరీలో ఏడు గ్రేవ్‌లు, బెక్కా గ్రేవ్‌తో సహా వాండలైజ్ అవుతాయి. టెక్నాలజీని నెట్‌వర్క్ హ్యాకర్స్ ఎన్‌క్రిప్ట్ చేస్తారు. దీంతో ‘ష్రౌడ్స్’ను చూడడం అసాధ్యమవుతుంది. కర్ష్ ఈ వాండలిజమ్ వెనుక ఒక భారీ కాన్‌స్పిరసీ ఉందని అనుమానిస్తాడు. ఇది ఇంటర్నేషనల్ ఫైనాన్షియర్స్, రష్యన్ – చైనీస్ ఇన్‌ఫ్లుయెన్సెస్‌తో లింక్ అయి ఉంటుంది. అతను డాక్టర్ హోఫ్‌స్ట్రా (సాండ్రిన్ హోల్ట్), డాక్టర్ రోరీ జావ్ (గై పీర్స్), ఇతర క్యారెక్టర్స్‌తో కలిసి ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని మలుపులు తిరుగుతుంది. మరి చివరికి దీని పరిణామాలు ఎలా ఉంటాయి ? అనేది తెరపై చూడాల్సిందే.
Read Also : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్