Cellar Safety: స్వేచ్ఛ బ్యూరో: వర్షాకాలం సమీపిస్తుండటంతో వానాకాలం కష్టాలు, ప్రకృతి వైపరీత్యాల నివారణలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందించాల్సిన జీహెచ్ఎంసీ వర్షాకాలం సెల్లార్ల ద్వారా జరిగే ప్రమాదాల నివారణపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్ల తవ్వకాలను నిలిపేస్తూ, ఇప్పటి వరకు నిర్మాణ అనుమతులు తీసుకుని, సెల్లార్ల తవ్వాకాలు, నిర్మాణాలైు చేపడుతున్న యాజమాన్యాలు, సంస్థలను గుర్తించి, క్షేత్ర స్థాయి పరిస్థితి పై నివేదికలను సమర్పించాలని నేడో, రేపో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అన్ని జోన్లు, సర్కిళ్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది.
గతంలో వర్షాకాలంలో వాన కురిసి ఆగిన తర్వాత సెల్లార్లలో భారీగా వర్షప నీరు చేరటం, ఇరుగు పొరుగు భవనాలకు ఎఫెక్టు అయ్యేలా, వాటి పునాదులు దెబ్బతినేలా తవ్వకాలు జరపటం వంటి కారణాలతో గతంలో పలు సార్లు సెల్లార్ ప్రమాదాలు జరిగి, పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కొల్పోయిన ఘటనలు జరిగిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు సెల్లార్ల తవ్వకాలకు అనుమతులను నిలిపేయటం, అప్పటికే జారీ చేసిన అనుమతుల ప్రకారం సెల్లార్ తవ్వకాలు ప్రమాద నివారణ ప్రమాణాలను అనుసరించి జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు సెల్లార్ల అసెస్ మెంట్ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
గతంలో ప్రమాద నివారణ ప్రమాణాలను పాటించకుండా ఇష్టారాజ్యంగా సెల్లార్లు తవ్విన కారణంగా ఎల్బీనగర్, సికిందరాబాద్, మలక్ పేట పీ అండ్ టీ కాలనీల్లో సెల్లార్ పక్క భవనాలు కూడా పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందిన ఘటనలు జరిగిన విషయం తెల్సిందే. ఇలాంటి ఘటనలను నివారించటంతో పాటు ఇప్పటికే అనుమతులు తీసుకున్న నిర్మాణదారులు, యజమానులు సెల్లార్లు తవ్వేందుకు అనుసరించాల్సిన ప్రమాదల నివారణ, జాగ్రత్తలకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎండాకాలం చివరి రోజులు కావటం, ఇతర జిల్లాల్లో ఇప్పటికే చిరుజల్లులు కురవటంతో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఎపుడు వర్షాలు కురుస్తాయో తెలియని పరిస్థితుల్లో వీలైనంత త్వరగా సెల్లార్ల అసెస్ మెంట్ చేయాలని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నిర్ణయించినట్లు, ఇందుకు సంబంధించి లిఖితపూర్వకమైన ఆదేశాలు నేడో, రేపో జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
Also Read: Intinti Ramayanam Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. అప్పుడే శుభం కార్డు..?
కొద్ది సంవత్సరాల క్రితం జీహెచ్ఎంసీ వర్షాకాలం కూడా తగిన ప్రమాద నివారణ ప్రమాణాలను పాటిస్తూ సెల్లార్లు తవ్వుకునేందుకు అనుమతులు జారీ చేసేది. కానీ కొంతకాలం క్రితం ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు గానీ, ప్రమాణాలు గానీ పాటించకుండా సెల్లార్లు తవ్వటంతో వర్షం కురిసి నీటితో నిండిన సెల్లార్లలో కార్మికులు పడి మృతి చెందటం, లేక సెల్లార్ ను ఇరుగుపొరుగు భవనాల పునాదులు దెబ్బతినేలా నిబంధలనకు విరుద్దంగా తవ్వటంతో సెల్లార్ లో పని చేస్తున్న కార్మికులపై ఇరువైపులా నున్న భవనాలు కూడా కార్మికులు మృతి చెందిన ఘటనలు జరగటంతో జీహెచ్ఎంసీ వర్షాకాలం సెల్లార్ తవ్వకాల అనుమతుల జారీని నిలిపేసింది. వర్షాకాలం ప్రారంభం కాకముందు నిర్మాణ అనుమతులు తీసుకున్న నిర్మాణదారులు, యజమానులు సెల్లార్లు తవ్వకునేందుకు ప్రత్యకంగా పలు ప్రమాద నివారణ ప్రమాణాలు, ఆంక్షలను అమలు చేస్తూ వస్తుంది. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం వచ్చే నెల జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, వర్షాలు కురిసే అవకాశాలుండటంతో జూన్ మాసం ప్రారంభం నుంచి నాలుగు నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసం మధ్య వరకు వరకు సెల్లార్ తవ్వకాల అనుమతులపై జీహెచ్ఎంసీ నిషేధం విధిస్తూ త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
చారిత్రక హైదరాబాద్ నగరంలో వందల ఏళ్ల క్రితం నిర్మించి, ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలను కూడా గుర్తించాలని టౌన్ ప్లానింగ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఎవరూ నివాసం లేకుండా వదిలేసిన ఇలాంటి భవనాల్లో వర్షకాలం నివాసముంటూ వర్షం దంచి కొట్టడంతో ఆ భవనాలు కుప్పకూలటంతో వాటిలో నివాసముంటున్న వారు నిద్రలోనే మృతి చెందిన ఘటనలు కూడా జరిగాయి. అప్పటి నుంచి వర్షాకాలానికి ముందు ఇలాంటి భవనాలను గుర్తించి, బాగా దెబ్బతిని, ఏ చిన్న పాటి వర్షం కురిసినా, కూలేందుకు సిద్దంగా ఉన్న భవనాలకు నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలని, కాస్త మరమ్మతులు చేపట్టాల్సిన భవనాలను గుర్తించి పట్టిష్ట పర్చాలని కూడా జీహెచ్ఎంసీ భావిస్తుంది. నేటికీ సికిందరాబాద్, పాతబస్తీలోని చార్మినార్ జోన్ లో ఇలాంటి భవనాలు వందల సంఖ్యలో ఉన్నట్లు, వాటిల్లో తమ పూర్వీకుల మధుర స్మృతులున్నాయని, వాటిని తలుచుకుంటూనే ఈ భవనాల్లో నివసిస్తున్నామని చెప్పుకునే వారు కూడా ఉన్నారు. వారి పట్ల జీహెచ్ఎంసీ ఎలా వ్యవహారిస్తుందో? వేచి చూడాలి.
Also read: కొరియా టూరిజం గౌరవ రాయబారిగా ప్రియాంక మోహన్ నియామకం..