ఆకతాయిలు చేసిన పనికి తన భవిష్యత్‌ను బలి చేయొద్దని వేడుకుంటోంది నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన టెంత్ విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మీ. టెంత్ పేపర్ లీక్ ఘటనకు తనను నిందిస్తూ.. పోలీసులు వేధించారని.. తన భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తూ.. తనను ఎగ్జామ్ నుంచి డిబార్ చేశారని ఆరోపిస్తోంది. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ప్రశ్నా పత్రాన్ని ఫోటో తీసుకున్నారని తెలిపింది. క్వశ్చన్ పేపర్ చూపించు.. లేకుంటే రాయితో కొడతామని బెదిరించి, క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారని తెలిపింది. ఆ సమయంలో నాకు భయం వేసి.. ఏం చేయాలో అర్థం కాక పేపర్ చూపించానని తెలిపింది.
ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని.. దయచేసి నా డిబార్‌ను రద్దు చేయాలని వేడుకుంది. ఎగ్జామ్‌కు అనుమతించకపోతే.. తనకు ఆత్మహత్యే శరణ్యమని విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేసింది. నేను క్లవర్ స్టూడెంట్‌ని.. నాకు ఎక్కడ ఎగ్జామ్ రాపిచ్చిన నేను రాస్తాను.. చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు.. దయచేసి ఎగ్జాం రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం నకిరేకల్ జడ్పీహెచ్ స్కూల్‌లో పేపర్ లీక్ అయిన ఘటన అందరికి తెలిసిందే. ఈ పరిణామంలో విద్యార్ధిని ఝాన్సీని డీ బార్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో తనకు ఏ పాపం తెలియదంటూ ఝాన్సీ, తన కుటుంబ సభ్యులు కూడా వాపోతున్నారు.
Also Read: పరకామణిలో చోరీ వివాదం.. మరోమారు తెరపైకి..
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మార్చి 21న విద్యార్థులు తెలుగు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరీక్షలు స్టార్ట్ అయిన మొదటిరోజే పేపర్ లీకేజ్ తో గందరగోళం నెలకొంది. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని ZPH స్కూల్ ఇన్విజిలేటర్ తెలుగు పేపర్ లీక్ చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇన్విజిలేటర్ ని విధుల నుంచి తొలగించారు. అలాగే సెంటర్ లోని మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఓ ఝాన్సీ అనే విద్యార్థిని డీబార్ కూడా చేశారు.