E-Paper
Advertisement

Gitam University: గీతం ‘పవర్’ బకాయిలు @ 118 కోట్లు.. 20 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోయినా చర్యలేవి?

Gitam University: గీతం ‘పవర్’ బకాయిలు @ 118 కోట్లు.. 20 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోయినా చర్యలేవి?
Advertisement

Gitam University: సామాన్యులకు వంద రెండొందల కరెంటు బిల్లునే కట్టకుంటే వేధించి లైన్ కట్ చేస్తారు విద్యుత్ సిబ్బంది. గత ఇరవై ఏళ్లుగా కరెంటు బిల్లు కట్టకుండా ఒక ప్రైవేట్ యూనివర్శిటీ నెట్టుకొస్తుంటే.. ఇంత వరకూ ఎలాంటి స్పందనా లేదు. కోర్టు కలగజేసుకునే వరకూ కనీస రియాక్షన్లు కరవు. ఇంతకీ ఎక్కడిదీ షాకింగ్ న్యూస్ అని చూస్తే..

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రుద్రారం గ్రామ శివారులో.. గీతం యూనివర్శిటీ ఉంది. ఈ ప్రైవేటు యూనివర్శిటీ సుమారు.. 20 ఏళ్లుగా కరెంటు బిల్లులు కట్టకుండా నెట్టుకొస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు రూ. 118 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదంటూ అధికారులు నోటీసుల్లో తెలిపారు. కానీ.. ఒక భారీ ప్రైవేట్ విద్యాసంస్థ కోట్ల రూపాయల బకాయిలు పెట్టినా విద్యుత్ శాఖ అధికారులు కనీసం నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా చేయలేకపోవడం వెనుక ఉన్న ‘మతలబు’ ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ హైకోర్టు విద్యుత్ శాఖ అధికారుల తీరును తీవ్రంగా ఖండించింది. కోర్టు జోక్యంతో స్పందించిన ఎస్‌పీడీసీఎల్ (SPDCL) బకాయిలు చెల్లించాలని తాజాగా యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా అధికారులు మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మొహం చాటేస్తున్నారు. ఇరవై ఏళ్లుగా రాజకీయ ఒత్తిళ్లా? లేక అధికారుల నిర్లక్ష్యమా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగంలోని ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది.

ALSO READ: JAC Protest: శంషాబాద్ బచావో..చార్మినార్ హటావో.. జేఏసీ, విద్యార్థుల భారీ ర్యాలీ

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×