E-Paper
Advertisement

ITDA Hospitals: తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో.. ఐటీడీఏ ఆసుపత్రులపై అధ్యయనం..?

ITDA Hospitals: తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో.. ఐటీడీఏ ఆసుపత్రులపై అధ్యయనం..?
Advertisement

ITDA Hospitals: స్వుచ్ఛ బ్యూరో: ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ పరిధిలోని ఆసుపత్రులపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. గోదావరి బెల్డ్ నుంచి కృష్​ణా పరివాహక ప్రాంతాల పరిధిలోని హాస్పిటల్స్ ను మరింత డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 9 మందితో కూడిన ఉన్నత స్థాయి కమిటీ స్టడీ చేస్తున్నది. ప్రస్తుతం ఆయా ఆసుపత్రుల్లో స్టాఫ్ ఎంత మంది ఉన్నారు? ఓపీ,ఐపీ సేవలు ఎలా ఉన్నాయి? ఆసుపత్రిలో ఏమేమీ పరికరాలు ఉన్నాయి? ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే వ్యవస్థ పటిష్టంగా ఉన్నదా? లేదా? ఏ తరహా పేషెంట్లు ఎక్కువగా ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు? ప్రస్తుతం అందుతున్న సేవలపై వారి స్పందన ఎలా ఉన్నది? ఇంకా చేయాల్సిన మార్పులు ఏమిటీ? అనే తదితర అంశాలపై ప్రభుత్వం అధ్యయనం మొదలు పెట్టింది. ఈ రిపోర్టు ఆధారంగా ఆయా ఆసుపత్రులను బలోపేతం చేయాలని సర్కార్ భావిస్తున్నది. ఇందుకోసమే ఐటీడీఏ ఆసుపత్రుల బలోపేతానికి మాస్టర్ ప్లాన్ ను రూపొంచడానికి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కసరత్తును మొదలు పెట్టారు. గోదావరి తీరం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న గిరిజన గూడాల్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ఐటీడీఏ పరిధిలోని ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రాంతాల్లోనే ఎందుకంటే..?

ఈ ప్రాంతాల్లో అత్యధికంగా సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో ఇప్పటికీ స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత వేధిస్తున్నది. అంతేగాక ఎమర్జెన్సీ కేసులు డీలే అవుతున్నాయి. సరైన స్టాఫ్​ లేక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత ఆసుపత్రి భవనాలు, పురాతన ఎక్విప్ మెంట్లతో నెట్టుకు వస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో పేషెంట్లకు సకాలంలో క్వాలిటీ వైద్యం అందడం కష్టతరంగా మారింది. సీరియస్ కేసులు రాగానే జిల్లా హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్ కు రిఫర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.ఈ క్రమంలో చాలా మంది పేద ప్రజలు ఆర్ధికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలోని ఆసుపత్రులను డెవలప్ చేయాలని సర్కార్ ప్రిపరేషన్ మొదలు పెట్టింది.

Advertisement

Also Read: Telangana Electricity: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు.. క్లారీటీ ఇచ్చిన ప్రభుత్వం

ఆరోగ్య శ్రీ నిధులతో..?

ప్రతీ ఏటా ప్రభుత్వం సుమారు రూ.500 కోట్ల వరకు ఆరోగ్య శ్రీ కోసం ఖర్చు పెడుతుంది. ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ నిధులు చెల్లించాల్సి వస్తోన్నది. ఈ క్రమంలో ఇవే నిధులతో ప్రభుత్వ దవాఖాన్లను మరింత డెవలప్ చేయొచ్చనే అభిప్రాయంలో సర్కార్ ఉన్నది. క్రమక్రమంగా ఆరోగ్య శ్రీ ఫండ్స్ లో కొంత ఖర్చు చేస్తూ జిల్లాలు వారీగా, ప్రాధాన్యత క్రమంలో సర్కారీ దవాఖాన్లను డెవలప్ చేయనున్నారు. ఇందులో తొలి విడత ఏజెన్సీ ఏరియాల్లోని ఆసుపత్రులను అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ప్రైవేట్ కు వెళ్లే పేషెంట్ల సంఖ్య కాస్త తగ్గుతుందనే భావనలో ప్రభుత్వం ఉన్నది. ఇందుకోసం నూతన డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ మిషన్లు, ఆపరేషన్ థియేటర్ల ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భద్రాచలం, ఊట్నూరు, నాగర్ కర్నూల్, ఏటూరు నాగరం ఐడీడీఏ పరిధిలోని ఆసుపత్రుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు.

Advertisement

Also Read: Gold Rates Hike: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ రేట్స్!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×