E-Paper
Advertisement

ఫుట్ పాత్ పై సర్కార్ సీక్రెట్ ఆపరేషన్.. మార్కింగ్ పడితే కూల్చివేత పక్కా..!

ఫుట్ పాత్ పై సర్కార్ సీక్రెట్ ఆపరేషన్.. మార్కింగ్ పడితే కూల్చివేత పక్కా..!
Advertisement

Footpath Clearance: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఏ సర్కారు కొలువుదీరిన ఫుట్ పాత్ ఆక్రమణలను ఉపేక్షించేది లేదంటూ ప్రకటనలు చేయటం మామూలైపోయింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపుపై ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటం, నగరంలో పాదచారులకు భద్రత ప్రశ్నార్థకంగా మారటంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు పాతబస్తీలో ఫుట్ పాత్ ఆక్రమణలపై కొరడా ఝళిపించిన సంగతి తెల్సిందే. కానీ ఆక్రమణల తొలగింపును పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుకోవటంతో పాతబస్తీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనటంతో పాటు అధికారులపై దాడికి యత్నించిన కొందరు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులపై కేసులు కూడా నమోదైన సంగతి తెల్సిందే. ఈ ఘటనను సర్కారు, జీహెచ్ఎంసీ సీరియస్ గా తీసుకుని ఈ సారి పక్కా ప్లాన్, పకడ్బందీ వ్యూహాంతో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపునకు సిద్దమైనట్లు తెలిసింది.

కూల్చివేతల కోసం..

ప్రతి శనివారం ఫుట్ పాత్ ఆక్రమణలై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి, తొలగించాలని సీక్రెట్ ప్లాన్ సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మినిష్టర్ క్వార్టర్స్ సమీపంలో ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు, మరి కొన్ని ఆక్రమణలు రోడ్డును ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించి, కూల్చివేతల కోసం మార్కింగ్ చేశారు. ఇంతటితో ఆగని అధికారులు ఈ యాక్షన్ ను మున్ముందు మరింత సీరియస్ గా నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగానే వచ్చే శనివారం 18వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో ఫుట్ పాత్ ఆక్రమణలు ఎక్కువగా ఉన్న ఏడు ప్రాంతాలను గుర్తించినట్లు, వాటిపై శనివారం ఉక్కుపాదం మోపేందుకు సిద్దమైనట్లు తెలిసింది.

Advertisement

Also Read: సొంత జిల్లాలో సీన్ రివర్స్.. బోత్సకు పీడకలగా మారిన కిమిడి నాగార్జున..?

ఖైరతాబాద్ సర్కిల్..

వీటిలో పాతబస్తీ పరిధిలోకి వచ్చే చార్మినార్, రాజేంద్రనగర్ లోని ఎక్కువ రద్దీగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు వచ్చే శనివారం 25వ తేదీన నగరం నడిబొడ్డులో ఉన్న ఖైరతాబాద్ సర్కిల్ లోని ఫుట్ పాత్ ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఆక్రమణల తొలగింపును అడ్డుకునే వారెంతటి వారైనా కఠిన చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న ఈ పుట్ పాత్ ఆక్రమణల డ్రైవ్ త్వరలోనే సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది.

ఇవి కావా ఆక్రమణలు.. వీటిపై చర్యలేవీ?

Advertisement

ముఖ్యంగా నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న జనాభా, వాహనాల సంఖ్య, రద్దీ, ట్రాఫిక్ కు అనుగుణంగా ఎప్పటికపుడు జీహెచ్ఎంసీ కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్డు విస్తరణ చేపడుతున్నా, పాదచారులకు ఆశించిన స్థాయిలో ఫుట్ పాత్ లు సమకూరటం లేదు. చాలా ప్రాంతాల్లో ఫుట్ పాత్ లను రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఆక్రమించుకుని, షాపులుగా నిర్మించి, అద్దెలకు నడిపిస్తుండగా, మరి కొన్ని ప్రాంతాల్లో సులాభ్ కాంప్లెక్స్ లు, మరి కొన్ని రద్దీ ప్రాంతాల్లో ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్, జీహెచ్ఎంసీ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగా ఈ ట్రాన్స్ ఫార్మర్లను ఫుట్ పాత్ లపై ఏర్పాటు చేయగా, ఇవి కూడా ఆక్రమణలుగా, కాలినడకన రాకపోకలు సాగించే పాదచారుల పాలిట ప్రాణ సంకటంగా మారిన నేపథ్యంలో ఫుట్ పాత్ పై ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్లను కూడా తొలగించి, ఫుట్ పాత్ లేని చోటకు మార్చాలన్న డిమాండ్లున్నాయి. ఇదిలా ఉండగా, సులాభ్ కాంప్లెక్స్ లు సైతం కమర్షియల్ గానే వ్యవహారిస్తున్నందున, వీటిని ఫుట్ పాత్ పై ఎందుకు కొనసాగిస్తున్నారు? జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 7 వేల పబ్లిక్ టాయిలెట్లు ఏమైనట్టు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫుట్ పాత్ లపై సులాభ్ కాంప్లెక్స్ లను నిర్మించి, కొనసాగించటం పట్ల గతంలో కోర్టులు కూడా జీహెచ్ఎంసీపై సీరియస్ అయిన సందర్భాలున్నందున, వీటిని కూడా ఫుట్ పాత్ నుంచి తొలగించాలన్న డిమాండ్లు విన్పిస్తున్నాయి.

Also Read: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం, ఎంపీ తేజస్వీపై మంత్రి జూపల్లి ఫైర్

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×