Big Stories

Governor Tamilisai : ఢిల్లీకి గవర్నర్.. ఏంటి సంగతి?

Governor Tamilisai : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. ఆ మర్నాడే తెలంగాణ గవర్నర్ తమిళిసైను కేంద్రం ఢిల్లీకి పిలిపించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు గవర్నర్. మొయినాబాద్ ఫాంహౌజ్ ఎపిసోడ్, కేసీఆర్ లీక్స్ లాంటి రాజకీయ సెగ రగులుతోంది. అటు, రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్ వార్ జరుగుతుండగా.. ఇలాంటి కీలక సమయంలో తెలంగాణ గవర్నర్ హస్తిన పర్యటన ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతోందా? అనే అనుమానాలూ లేకపోలేదు.

- Advertisement -

మునుగోడు బై పోల్ తర్వాత గవర్నర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని పలు అంశాలపై కేంద్ర హోంమంత్రికి గవర్నర్ పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఫాంహౌజ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై వీరి మధ్య ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

ఫాంహౌజ్ ఫైల్స్ వీడియోల్లో ఏకంగా అమిత్ షా, బీఎల్ సంతోష్, మోదీల పేర్లు వినిపించడంతో కేంద్రం-బీజేపీ డిఫెన్స్ లో పడ్డట్టు అయ్యాయి. తమకేం సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ చెబుతున్నా.. జాతీయ నేతల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి రియాక్షన్ రాలేదు. మౌనం అర్థ అంగీకారమే అంటోంది టీఆర్ఎస్. తీవ్ర ప్రభావం చూపగల ఫాంహౌజ్ వ్యవహారం గురించి గవర్నర్ తమిళిసై.. సమగ్ర నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన పలు బిల్లులు ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వాటిని చాలాకాలంగా ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు గవర్నర్. తన విశేష అధికారాలతో.. ఆ ఫైల్స్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అలానే పెండింగ్ లోనే ఉంచారు. ఈ విషయం తెలంగాణ సర్కారును తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీలో ఈ అంశం చర్చకు రానున్నట్టు సమాచారం.

ఇక, ఎంత అధికారికి కార్యక్రమమైనా.. మునుగోడు ఉప ఎన్నిక అంశం చర్చకు రాక మానదు. బీజేపీ ఓటమికి కారణాలపై విశ్లేషణ జరిగే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఏదిఏమైనా మునుగోడు ఫలితం వచ్చిన మర్నాడే గవర్నర్ తమిళిసై.. అమిత్ షాను కలవడం ఆసక్తిగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News