E-Paper
Advertisement

TRS Public Notice : టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ పబ్లిక్ నోటీస్..

TRS Public Notice : టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ పబ్లిక్ నోటీస్..
Advertisement

TRS Public Notice : మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సంఘానికి వినతిపత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్‌ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ పార్టీ తరఫున పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో ఎన్నికల కమిషన్‌‌కు తెలపాలని నోటీసులో పేర్కొన్నారు.

ఇటీవళ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా వెళ్తుందని ప్రకటించిన విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రకటనకు ముందు కేసీఆర్ దేశవ్యాప్తంగా అనేక మంది బీజేపీ యేతర జాతీయ, రాష్ట్ర పార్టీల నాయుకులను కలిశారు. కుమార స్వామి, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి జాతీయ నాయుకులతో మంతనాలు జరిపారు. నిన్న మునుగోడులో టీఆర్ఎస్ 10వేల మెజార్టీతో గెలుపొందడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు పార్టీ శ్రేణులందరిలో జాతీయ రాజకీయాలపై మరింత జోష్ పెరిగింది. మునుగోడును కైవసం చేసుకునేందుకు బీజేపీ జాతీయ స్థాయిలో వ్యూహాలు రచించింది. మునుగోడు గెలుపుతో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఓ మెట్టు ఎక్కినట్లు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×