BigTV English

KCR – Gutha Issue: కేసీఆర్ మెడకు గుత్తా ఉచ్చు.. అడ్డంగా దొరికిపోయాడు!

KCR – Gutha Issue: కేసీఆర్ మెడకు గుత్తా ఉచ్చు.. అడ్డంగా దొరికిపోయాడు!

సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పనులివి గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంగా ఉన్న కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు నెలలు ప్రయత్నించినా దొరకలేదు. ఆయన సామాన్య ప్రజానీకం కూడా కాదు. ఓ శాసనమండలి చైర్మన్‌. ఆయనకే కేసీఆర్ దర్శనభాగ్యం దక్కలేదంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రగతి భవన్ లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ పరిమితమైన ప్రాంతం. వీటిని దాటి ఆయన ప్రజల మధ్యలోకి వచ్చిన దాఖలాలు లేవు. కనీసం పార్టీ నేతలకు, ప్రభుత్వ పెద్దలకు కూడా అందని ద్రాక్షలా మారరన్న విషయం సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలతో అర్థమవుతుంది. బీఆర్ఎస్‌ పార్టీ నిర్మాణం సరిగా లేదు. నాయకులలో అహంకారం పెరిగింది. అందుకే ప్రజలు పార్టీని దూరం పెట్టారు. TRS ఉద్యమ పార్టీ.. BRS కుటుంబ పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారంలో KCR విఫలమయ్యారు. చెప్పుడు మాటలు విని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంటిలిజెన్స్‌ వాళ్లపైనే డిపెండయ్యారు. ఇవీ గుత్తా చేస్తున్న మరికొన్ని ఆరోపణలు.

Also Read: బీఆర్ఎస్ గెలవడానికి కాదు.. డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం చేయాలి: కిషన్ రెడ్డి


ఓ రకంగా చూస్తే ఈ ఆరోపణలు నిజాలే అనిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా గుత్తా చేసిన కీలక ఆరోపణ. కేసీఆర్ ఇంటెలిజెన్స్‌ వాళ్లపైనే ఆధారపడ్డారని చెప్పడం. ఫోన్ ట్యాపింగ్‌లు.. పోలీస్ నెట్‌వర్క్‌ను పార్టీకి పనులకు ఉపయోగించుకొని సమాచారాన్ని సేకరించడం.. అనేది ఇప్పటికే ఖరారైంది. చాలా మంది ఉన్నతాధికారులు ఇప్పటికే చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. సో.. సొంత నేతలకంటే కేసీఆర్ ఇంటెలిజెన్స్‌ వాళ్లపైనే ఎక్కువ ఆధారపడ్డరన్నది అలిగేషన్‌ కాదు.. వాస్తవమని తెలుస్తుంది.

కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం. ఇది అప్పటి ఇంటెలిజెన్స్ అధికారుల పరిస్థితి. నిజాన్ని నిర్భయంగా చెబితే కేసీఆర్ మొహమాటం లేకుండా తిట్టే వారని అందుకే ఆయనకు అనుకూలంగా రిపోర్ట్‌లు ఇచ్చేవారని తెలుస్తోంది. దీంతో ఆ రిపోర్టులపైనే ఆధారపడ్డ కేసీఆర్.. నేతలకు దూరమయ్యారు. వారిని దూరం పెట్టారు. అప్పటికే కల్వకుంట్ల కుటుంబ పెద్దలు చెప్పిందే వేదమన్న మాట. పార్టీలో చక్కర్లు కొడుతుంది. దీనికి తోడు కేసీఆర్‌ను కలిసి మాట్లాడే అవకాశం లేకపోవడంతో..
చాలా మంది నేతల్లో అసంతృప్తి నెలకొంది. అదే బీఆర్ఎస్‌ కొంపముంచింది.

Also Read: Case on BJP Madhavi Latha: బీజేపీ అభ్యర్థి మాధవీపై కేసు, ఎందుకు?

అంతేకాదు దాదాపు 30 నుంచి 35 మంది అభ్యర్థులను మార్చితే.. బీఆర్ఎస్ గెలిచే చాన్స్ ఉండేదన్న టాక్ ఉంది. కానీ ఈ విషయాన్ని నేతలు తనకు చెప్పే స్వేచ్ఛను కూడా కేసీఆర్ వారికి ఇవ్వలేదని తెలుస్తుంది. నిజానికి తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్ తొలిసారి గెలిచారు. సంక్షేమ పథకాలతో రెండో సారి అధికారంలోకి వచ్చారు. కానీ 2023లో ఓడారు. రీజన్‌ పాలనలో, కేసీఆర్ ప్రవర్తనలో వచ్చిన మార్పు. ఈ మార్పును ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలూ గమనించారు. కొందరు ఎన్నికలకు ముందు అందుకే ఇతర పార్టీల్లో చేరారు. బీఆర్ఎస్‌ ఓటమి కోసం పనిచేశారు.. విజయం సాధించారు. మరికొందరు ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీని వీడారు. ఇప్పుడు పార్టీని మరింత బలహీన పరుస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే పార్టీని చేజేతులా నాశనం చేసుకున్నది కేసీఆర్ ప్రవర్తన, వ్యవహారశైలే అని అర్థమవుతుంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×