Guvvala Balaraju: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎందుకు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు? ఆ పార్టీలో అంతర్గత కలహాలే కారణమా? కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వచ్చిన తర్వాతే ఎందుకు రాజీనామా చేశారు? ముందు ఎందుకు చేయలేదు? కవిత చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజమేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కాళేశ్వరం నివేదిక బయటకు వచ్చిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ పార్టీకి బైబై చెప్పేశారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే గువ్వల బాలరాజు ఓ వెలుగు వెలిగారు.
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఆయన పేరు పొందారు. అలాంటి వ్యక్తి ఎందుకు రాజీనామా చేశారు? బీజేపీలో బీఆర్ఎస్‌ని విలీనం చేసే పరిస్థితులు వచ్చాయా? ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయాలు నిజమేనా? పార్టీని కలిపే బదులు మనమే బీజేపీలోకి వెళ్లిపోతే బెటరని భావించారు. తన మద్దతుదారుడితో ఫోన్ మాట్లాడిన సమయంలో ఇదే విషయాన్ని గువ్వల బయటపెట్టారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గువ్వలను బిగ్ టీవీ పలుకరించింది. అందులో సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలనే కోరిక తనకు బలంగా ఉందన్నారు. విద్యార్థి సంఘాలు, కుల సంఘాలను అడ్డుపెట్టుకుని రాజకీయ నేతగా రాణించాలనే ఆలోచన తనకు ఏ మాత్రం లేదన్నారు.
ALSO READ: తెలంగాణలో కుండపోత వర్షం.. ఆ జిల్లాల ప్రజలు బయటకు రావొద్దు
ఉమ్మడి ఏపీలో బలమైన పార్టీలు ఉన్నప్పుడు బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యానని గుర్తు చేశారు గువ్వల బాలరాజు. సరిగ్గా 2007లో కాంగ్రెస్ రూలింగ్‌లో ఉందన్నారు. అప్పుడు టీడీపీ బలమైన ప్రతిపక్షంగా ఉందన్నారు. అలాంటి సమయంలో తాను టీఆర్ఎస్ లో జాయిన్ అయిన విషయాన్ని గుర్తు చేశారు.
రాయలసీమ-తెలంగాణ సరిహద్దు ప్రాంతం మహబూబ్‌నగర్ జిల్లా ఉందన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ ద్వారా తెలంగాణ వస్తుందని ప్రజల మాదిరిగా తాను భావించానన్నారు. అందుకే వారి నాయకత్వంలో పని చేశానని చెప్పారు. ఉద్యమం కోసం తనవంతు పాత్ర పోషించానని అన్నారు.
భవిష్యత్తులో ఏమి చెయ్యాలని భావిస్తున్న సమయంలో రాష్ట్ర వైపు కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయాలను అర్థం చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందని భావించానని మనసులోని మాట బయటపెట్టారు గువ్వల బాలరాజు. ఆ ఆలోచనతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానన్నారు.
ఎవరి వల్ల ఆ పార్టీలో తనకు ఇబ్బంది లేదనన్నారు. సంతృప్తిగానే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. తన రాజీనామా వల్ల బీఆర్ఎస్-కేసీఆర్ ఇబ్బందిపడే అవకాశముందన్నారు. తన ఆశయాలకు అనుగుణంగా బయటకు వచ్చానన్నారు. వారి మొప్పు కోసం పని చేయాల్సిన అవసరం లేదన సూటిగా కుండబద్దలు కొట్టేశారు.
కాళేశ్వరం రిపోర్టు వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామా చేశారు? ముందుకు ఎందుకు చేయలేదనే దానిపై గువ్వల ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ లెక్కన బీఆర్ఎస్ ముగినిపోతున్న నావ మాదిరిగా ఆయన వర్ణించినట్టు మద్దతుదారుల మాట. ఆయన దారిలో మరికొందరు కారు దిగి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.
బిగ్ టీవీతో గువ్వల బాలరాజు
తన రాజీనామాపై స్పందించిన గువ్వల బాలరాజు
పూర్తి స్థాయి అవగాహన, సంతృప్తితోనే రాజీనామా చేశానని స్పష్టం https://t.co/Rky88zFmIv pic.twitter.com/z8CdNzFTeL
— BIG TV Breaking News (@bigtvtelugu) August 4, 2025