BigTV English

Sports School : బాలికలపై లైంగిక వేధింపులు.. కవిత ట్వీట్.. ఆ అధికారిపై మంత్రి యాక్షన్..

Sports School : బాలికలపై లైంగిక వేధింపులు.. కవిత ట్వీట్.. ఆ అధికారిపై మంత్రి యాక్షన్..

Sports School : హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం జరిగింది. బాలికలపై హరికృష్ణ అనే అధికారి లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యవహారం కలకలం రేపింది. ఆ అధికారి అర్ధరాత్రి దాటిన తర్వాత బాలికల గదుల్లో అక్రమంగా చొరబడ్డారని ఆరోపణలు వచ్చాయి. సాయంత్రం వేళలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి.


హరికృష్ణ వేధింపులు తాళలేక బాలికలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనపై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈ ఘటనను తనను ఎంతో కలిచివేసిందని ట్వీట్ చేశారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం యాక్షన్ తీసుకోవాలని కవిత కోరారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఆమె ట్విట్టర్ లో కోరారు.


ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై వెంటనే స్పందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేశామని ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ప్రకటించారు.

మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై హకీంపేట్ స్పోర్స్ స్కూల్స్‌ OSD హరికృష్ణ స్పందించారు. తనపై బాలికలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారంతో స్పోర్ట్స్ స్కూల్ ప్రతిష్టకు భంగం కలుగుతోందని హరికృష్ణ అంటున్నారు.

మరోవైపు హకీంపేట్‌ స్పోర్ట్స్ స్కూల్‌లో లైంగిక ఆరోపణలపై కమిటీ విచారణ చేపట్టింది. గర్ల్స్ హాస్టల్‌లో లైంగిక వేధింపుల ఆరోపణపై కమిటీ విచారణ నిర్వహించింది. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, షీ టీం, ఆర్డీవో, స్టేట్ చైల్డ్ రైట్ కమిషన్ సభ్యులు విచారణ నిర్వహించారు. బాలికలు, స్టాఫ్, కోచ్‌లను విడివిడిగా విచారించిన అధికారులు వారి స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశారు. సోమవారు మరోసారి విచారణ జరుపతామని అధికారులు తెలిపారు.

మరోవైపు హకీంపేట్ స్పోర్ట్స్ OSDగా సుధాకర్ ను నియమించారు. వెంటనే ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జింఖానా స్పెషల్ స్పోర్ట్స్ అధికారిగా పనిచేస్తున్నారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×