BigTV English

Harish Rao : దేశం కోసం బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు – కేంద్రానికి హరీష్ రావు ఘాటు ప్రశ్నలు

Harish Rao : దేశం కోసం బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు – కేంద్రానికి హరీష్ రావు ఘాటు ప్రశ్నలు

Harish Rao : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశాభివృద్ధికి వినియోగించుకోవాల్సిన బడ్జెట్ ను కేంద్రంలోని బీజేపీ.. తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్ వెలువడిన తర్వాత సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించిన మాజీ మంత్రి హరీష్ రావు.. కేంద్రం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 


కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ కల.. ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా.? అని ప్రశ్నించిన హరీష్ రావు.. కేంద్రం తన నిర్ణయాలను పునర్ సమీక్షించుకోవాలని కోరారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. దేశమంటే మట్టి కాదోయో.. దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్, దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరమంటూ అసహనం వ్యక్తం చేశారు.

తొలిరోజుల నుంచి కేంద్రంలోని బీజేపీ తీరు ఇలాగే ఉందని.. కేవలం తన రాజకీయ అవసరాలు తీర్చుకునేందుకే బడ్జెట్ ప్రవేశపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 బడ్జెట్ కేవలం దిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసమే ప్రవేశపెట్టారని అన్నారు. ఈ లెక్కలో 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు.


తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించిందన్నారు. కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోస పోయిందని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. బడ్జెట్ లో నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న హరీష్ రావు.. బడ్జెట్ కు పది రోజుల ముందు 40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాశారన్నారు. అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

బిజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయిందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్ధతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేసుకున్న బీఆర్ ఎస్ నేత.. కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్ (యూ) బీహార్‌లో వివిధ అభివృద్ధి పనులకు భారీగా నిధులు సాధించిందన్నారు. గతేడాది రూ. 26,000 కోట్ల సాయం పొందిన బీహార్.. 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందిందన్నారు. 

Also Read :  తులం బంగారానికి ఆశపడి ఓటేశారు.. జనాలను కించపరిస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు..?

ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బిహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారని విమర్శించిన హరీష్ రావు.. బిహార్ లో మఖాన బోర్డు ఏర్పాటు, మిథిలాంచల్ లో వెస్టర్న్ కోసి కెనాల్, ఐఐటీ పాట్నా విస్తరణ, బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి ఏం సాధించాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు.. 8 సీట్లల్లో కాంగ్రెస్, 8 సీట్లల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే.. నిధులు సాధించలేకపోయారన్నారు.  తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు మౌనం దాల్చారంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. కేంద్రం మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×