CM Chandrababu Naidu: ఆడబిడ్డల కోసమే దీపం పథకం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమలో ఆయన మాట్లాడారు. ఏపీని గుంతలు లేని రాష్ట్రంగా మారుస్తామని.. ఇది పేదల ప్రభుత్వమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘పేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం మనది. పింఛన్ల వల్ల వృద్ధులకు గౌరవం పెరిగింది. అన్నా క్యాంటీన్లలలో రూ.5లకే భోజనం అందిస్తున్నాం. మే నుంచి రైతు భరోసా ఇస్తాం. దేశంలోనే అత్యధిక ఫించన్లు ఇస్తున్నాం. ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.48వేలు ఇస్తున్నాం. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం.. మాట నిలబెట్టుకున్నాం. పేదలకు అధిక ఫించన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పేదల జీవితాలను భరోసా తీసుకొచ్చాం. ఆరు నెల్లలో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. డ్రోన్ హబ్ ద్వారా భారీగా ఉద్యోగాలు తెస్తాం. ప్రజల చేతిలోకే పాలనను తీసుకొచ్చాం. మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేలా ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంట్లో ఓ ఐటీ ఉద్యోగి ఉండాలి. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రజల కోసం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మంత్రి లోకేష్ ఆలోచనలతో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
‘వైసీపీ పాలనలో చాలా నష్టపోయాం. 20 ఏళ్లు వెనక్కి పోయాం. ప్రజల్లోనూ ఆలోచన విధానం మారాలి. 2047 నాటికి ఏపీలో పేదవాళ్లు ఉండకూడదు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం ఏపీని నాశనం చేసింది. అప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. నా మాట నమ్మకంతో అమరావతి రైతుల భూములు ఇచ్చారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం’ అని చెప్పుకొచ్చారు.
బడ్జెట్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు…
కేంద్ర బడ్జెట్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రజానుకూలమైన.. ప్రగతిశీల బడ్జెట్ ఇది. వికిసత్ భారత్‌ను బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆరు కీలక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. దేశాభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగు. దేశ భవిష్యత్ ను వెలుగొందించే ప్రణాళికగా నిలుస్తుంది. మధ్య తరగతికి పన్ను రాయితీలు కల్పించడం ద్వారా.. వారికి ఉపశమనం కలుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మిడిల్ క్లాసెస్ ఫ్యామిలీలకు పన్ను మినహాయింపు గొప్ప విషయమని చెప్పారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని సీఎం ట్వీట్ చేశారు.
Also Read: PM Narendra Modi: ఇది ప్రజల బడ్జెట్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
మహిళలు, పేదలు, యువత రైతుల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. జాతీయ శ్రేయస్సు వైపు కీలక అడుగులు సూచిస్తోందని చెప్పారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు గానూ కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కి సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.