E-Paper
Advertisement

TGSRTC Conductor: మహిళలపై బూతులతో రెచ్చిపోయిన ఆర్టీసీ కండక్టర్.. వీడియో వైరల్

TGSRTC Conductor: మహిళలపై బూతులతో రెచ్చిపోయిన ఆర్టీసీ కండక్టర్.. వీడియో వైరల్
Advertisement

TGSRTC Conductor:  హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌పై టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా..  బూతు పురాణం అందుకున్న సదరు కండక్టర్‌ను విధుల నుంచి తప్పించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

హయత్‌నగర్ డిపోకు చెందిన 218H రూట్ బస్సులో ప్రశాంత్ అనే కండక్టర్ విధుల్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న కొందరు మహిళా ప్రయాణికులకు, కండక్టర్‌కు మధ్య చిన్నపాటి కారణంతో మొదలైన మాటల యుద్ధం కాస్తా తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన కండక్టర్ ప్రశాంత్..  మహిళలని కూడా చూడకుండా అత్యంత అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.

Advertisement

మహిళలు గట్టిగా ప్రశ్నించగా..  ‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. ఎవరికీ భయపడేది లేదు’ అంటూ కండక్టర్ ప్రశాంత్ వారితో వాగ్వాదానికి దిగారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ..  ఇరువర్గాల మధ్య గొడవ సద్దుమణగలేదు. ఈ ఉద్రిక్తత కారణంగా బస్సులోని ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

బస్సులో జరిగిన ఈ రసాభాసను కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీనిపై తీవ్రంగా స్పందించిన హయత్‌నగర్ డిపో మేనేజర్,  ఇతర అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. కండక్టర్ ప్రశాంత్‌ను విధులకు దూరంగా ఉంచుతూ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులతో ప్రవర్తించాల్సిన తీరుపై నిబంధనలను అతిక్రమించినందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మహిళా ప్రయాణికుల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం నేపథ్యంలో..  కండక్టర్లు ,  మహిళా ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. అయితే..  అసభ్య పదజాలంతో దూషించడం అనేది తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యమని అధికారులు భావిస్తున్నారు.

ALSO READ: Fire Accident: ఆర్మీ క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×