BigTV English

KTR: హెచ్‌సీయూ భూవివాదం.. కేటీఆర్ బహిరంగ లేఖ.. ఇదంతా దీని కోసమేనా..?

KTR: హెచ్‌సీయూ భూవివాదం.. కేటీఆర్ బహిరంగ లేఖ.. ఇదంతా దీని కోసమేనా..?

KTR: హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ భూముల్లో కొంత భాగం చెట్లను రాష్ట్ర ప్రభుత్వం జేసీబీల సాయంతో తొలగించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించి వెంటనే ఆక్కడ పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేేయడంతో.. ప్రభుత్వం చెట్ల తొలగింపు ప్రక్రియను ఆపింది.


చెట్ల నరికివేతపై రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి సుప్రీం సమయం కూడా ఇచ్చింది. అయితే సుప్రీం తీర్పుతో అప్రమత్తమైన రేవంత్ సర్కార్ మంత్రులతో ఓ కమిటీ వేసింది. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు కంచ గచ్చిబౌలి భూములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు.

ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను, మన సమిష్టి భవిష్యత్తు పట్ల మనకున్న ఆందోళనను పంచుకునే తోటి పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని రక్షించడానికి తమ స్వరాన్ని పెంచిన ప్రతి విద్యార్థి, పర్యావరణవేత్త, జర్నలిస్ట్, ప్రజా వ్యక్తి, పౌరుడికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ధైర్యం, స్థితిస్థాపకత, అచంచలమైన స్ఫూర్తి మొత్తం దేశానికి స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. అందరం కలిసి చేసి ఈ ఉద్యమంలో 400 ఎకరాల పచ్చదనాన్ని, 734 జాతుల పుష్పించే మొక్కలు, 220 జాతుల పక్షులు, 15 జాతుల సరీసృపాలు, 10 జాతుల క్షీరదాలకు జీవనాధారం అయిన ప్రకృతిని కాపాడమని కేటీఆర్ పేర్కొన్నారు.


ALSO READ: Cardiac Arrest: చిన్న వయస్సులోనే.. గుండెపోటుతో ఎందుకు చనిపోతున్నారు ?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కేవలం ఒక రియల్ ఎస్టేట్ కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి తన పోరాటం ఇంకా ముగియలేదని చెప్పారు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ తమ స్వార్థం కోసం ప్రకృతిని డిస్టర్బ్ చేయడం బాధగా ఉందని అన్నారు. అభివృద్ధి అనే పేరుతో 400 ఎకరాల అటవీ భూమిని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు చేశారు. హెచ్‌సీయూ భూములను కాపాడుకోవడానికి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంతో పోరాడారని అభినందించారు. భూములను రక్షించుకునేందుకు శాంతియుత, ధృడ నిశ్చయంతో ఉద్యమానికి నాయకత్వం వహించారని చెప్పుకొచ్చారు. స్టూడెంట్స్ పోరాట పటిమన కేటీఆర్ మెచ్చుకున్నారు. స్టూడెంట్స్ తో తమ గొంతుకను వినిపించి, భుజం భుజం కలిపి నిలబడిన అనేక మంది కార్యకర్తలు, జర్నలిస్టులు, పౌరులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేటీఆర్ లేఖలో చెప్పారు.

ప్రకృతి కోసం చేసిన ఈ ఉద్యమాన్ని గౌరవించేంది పోయి.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం మొదలు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులను కావాలనే నిందించడం సరైనది కాదని చెప్పారు. యూనివర్సిటీ ప్రాంగణాన్ని వేరే చోటికి మార్చాలనే నెపంతో కూల్చివేస్తామని బెదిరించడం ద్వారా వారు తమ తప్పుల నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై చేసిన దాడి కాదని.. ఇది ప్రకృతిని డిస్టర్బ్ చేయడమే అని అన్నారు. ఎకో పార్క్‌ పేరుతో ప్రభుత్వం మరో మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని.. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కేటీఆర్ లేఖలో రాసుకొచ్చారు.

ALSO READ: CM Revanth Reddy: సామాన్యుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం..

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×