BigTV English
Advertisement

Weather News: తెలంగాణకు ఉరుముల వర్షం.. ఈ జిల్లాల వారు జాగ్రత్త, బయటకు రావొద్దు

Weather News: తెలంగాణకు ఉరుముల వర్షం.. ఈ జిల్లాల వారు జాగ్రత్త, బయటకు రావొద్దు

Weather News: ఈసారి దేశ వ్యాప్తంగా వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో రావాల్సిన నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రైతులు కూడా వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. పలు జిల్లాల్లో ఇప్పటికే పత్తిగింజలు కూడా పెడుతున్నారు. కొందరు నార్లు కూడా పోశారు. మరి కొంత మంది రైతులు పొలాలను ఇప్పుడే చదును చేస్తున్నారు. పంటపొలాల్లో రైతు నేస్తాలు ఆరుద్ర పురుగులు దర్శనం ఇస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.


తెలుగు రాష్ట్రాలో గత వారం రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. సేమ్ టైం.. పగటి వేళ ఎండలు కూడా దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అయితే ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు బీభత్సం సృష్టించడంతో.. కొంతమంది చనిపోయారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది. తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ALSO READ: AP Weather update: ఏపీ ప్రజలకు అలర్ట్.. మరికొద్ది గంటల్లో దంచుడే..


ఈ రోజు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు అంటే.. జూన్ 4వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

ALSO READ: ISRO Notification: అద్భుత అవకాశం.. ఇస్రోలో ఉద్యోగాలు, లైఫ్ సెట్ భయ్యా

మరోవైపు ఈరోజు, రేపు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం పడొచ్చని అధికారులు తెలిపారు. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లుల పడే అవకాశం ఉందని వివరించారు. ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ మూడు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.

Related News

Ande Sri: గొడ్ల కాపరి నుంచి.. గేయ రచయితగా.. ప్రజాకవి అందెశ్రీ బయోగ్రఫీ

Kcr Campaign: జూబ్లీహిల్స్ ప్రచార బరిలో కేసీఆర్.. చివరకు అలా ముగించారు

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు: ఎన్నికల అధికారి కర్ణన్

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Ande Sri: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఆదివారం సాయంత్రానికి సగం పంపిణీ? ఓటుకు రెండు వేలా?

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Big Stories

×