WI Team In Traffic : సాధారణంగా వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడం మనం చూస్తుంటాం. అలాగే పిచ్ చిత్తడి గా ఉండటం వల్ల.. ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడం వల్ల, బౌన్సి పిచ్ కారణంగా ప్లేయర్ల కి గాయాలు అయితే.. మిడతల గుంపు దాడి చేసినప్పుడు.. లేక గ్రౌండ్ లోకి పాము, కుక్క ఇలాంటివి వచ్చినప్పుడు మ్యాచ్ కి అంతరాయం కలిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇవాళ ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండిస్ మధ్య మూడో వన్డే ఓ వింత కారణం వల్ల ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభం అయింది. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ సాయంత్రం.. 5 గంటలకు టాస్ జరగాల్సి ఉంది. కానీ వెస్టిండిస్ ప్లేయర్లు .. హోటల్ రూమ్ నుంచి సరైన సమయానికి బయలుదేరినప్పటికీ.. వారి టీమ్ బస్సు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయింది. దీంతో దాదాపు 40 నిమిషాల పాటు ప్లేయర్లు ఆలస్యంగా స్టేడియానికి వచ్చారు.
Also Read : Chris Gayle: కోహ్లీకి గేల్ వెన్నుపోటు…ఇంత దారుణం ఎక్కడా ఉండదు !
బర్మింగ్ హోమ్ లో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తరువాత కార్డిప్ తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్య ఛేదనలో జెమీ స్మిత్, బెన్ డకౌట్, జోస్ బట్లర్ డకౌట్ అయ్యారు. అయితే జోస్ బట్లర్ 139 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 166 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి.. ఇంగ్లాండ్ జట్టు కి విజయాన్ని అందించాడు. చివరి వన్డే లో గెలిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలనుకుంది. ఆతిథ్య ఇంగ్లాండ్ మరోవైపు చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది.
Also Read : Musheer Khan : విరాట్ కోహ్లీ పరువు తీసిన ముషీర్ ఖాన్… మిమ్మల్ని టైటిల్ గెలవనివ్వమంటూ సిగ్నల్స్
మరోవైపు టాస్ ఆలస్యంగా జరగడంతో మ్యాచ్ కి ఆలస్యం అయింది. అయితే ఈ మ్యాచ్ లో వెస్టిండిస్ జట్టు 15 ఓవర్లకు 83 పరుగులు చేసింది. ఇక వెస్టిండిస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ లెవిస్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ హోప్ డకౌట్ గా వెనుదిరిగాడు. రూథర్ పోర్డ్ 33, కార్టీ 24 పరుగులతో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో తెగ చర్చించుకోవడం విశేషం. అయితే వర్షం కారణంగా కొద్ది సేపు మ్యాచ్ ఆగిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో.. మ్యాచ్ ని 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించారు. మళ్లీ మ్యాచ్ ప్రారంభం అయింది. వెస్టిండిస్ జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరీ.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 3, 2025