Hyderabad Rains: తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది.
ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులకు ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాత భవనాలు, చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఒక్కసారిగా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్, వాహనదారుల అవస్థలు పడ్డారు.
కాగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో మోస్తారు వర్షం పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. గాలితో కూడిన వర్షం పడింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపుర్, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం కురిసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్, ఉప్పల్, బోడుప్పల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, చాంద్రాయన్ గుట్ట, ఫలక్ నుమా, సంతోష్ నగర్, కాంచన్ బాగ్, శాలిబండ, ఛత్రినాక, బషీర్బాగ్, కోఠి, హిమాయత్ సహా పలు ఏరియాల్లో వాన పడింది.
మరోవైపు దేశంలో వర్షాలు విస్తృతంగా కురుస్తన్నాయి. ఢిల్లతో పాటు ఉత్తరభారతదేశంలోని పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య , మధ్య, తూర్పూ భారత్‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్‌లలో పలుచోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్న ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భవనాలు కుప్పకూలాయి, కొండ చర్యలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి. చంబ, కాంగ్రా, కులు, మండీ, శిమ్లా, సోలన్, సిర్మోర్ జిల్లాల్లో వచ్చే 24గంటల్లో వరద ముప్పు ఉందని అధికారులు ప్రకటించారు.
Also Read: తెలంగాణ చరిత్రలో ఘోరం.. విషాదాన్ని మిగిల్చిన సిగాచి, 42కి చేరిన మృతులు
ఒడిశాలోని ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండంతో.. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. సుబర్ణరేఖ నది ప్రమాద స్ధాయిని మించి ప్రవహిస్తోంది. బాలాసోర్, మయూర్‌భంజ్ ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెండిగడ్‌తో పాటు పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురిశాయి.