BigTV English

Rains : తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..

Rains : తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..

Rains : తెలంగాణలో వర్షాలు ఆగడంలేదు. వరుణుడు తగ్గేదేలే అంటున్నాడు. 6 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. మంగళవారం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గురు, శుక్రవారాల్లో వర్షాలు భారీగా ముంచెత్తాయి. శని, ఆదివారాలు వరుణుడు కాస్త శాంతించాడు. కానీ మరో 3రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.


ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతవారణశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మంగళ, బుధవారాల్లో వానలు జోరుగా కురుస్తాయని ప్రకటించారు. ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం దక్షిణ ఒడిశా పరిసరాలలో సగటు సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. షియర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల – 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. ఈ నెల 24న దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అలాగే భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×