Viral Video: టికెట్ లేని ప్రయాణం నేరం అని రైల్వే అధికారులు చెప్తున్నప్పటికీ, ప్రయాణీకులలో మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలా మంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. తరచుగా టికెట్ చెకింగ్ అధికారులకు చిక్కి జరిమానా కడుతున్నారు. తాజాగా టికెట్ లేకుండా ప్రయాణించిన యువతి.. అధికారులకు దొరికి నానా రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముంబై సబర్బన్ రైల్వే నెట్ వర్క్ పరిధిలో ఘటన
ముంబైలోని రద్దీగా ఉండే సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ ఇటీవల టికెట్ తనిఖీలు నిర్వహించారు. ప్రయాణీకులు టికెట్స్ చెక్ చేశారు. థానే రైల్వే స్టేషన్ లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద ఈ తనిఖీలు కొనసాగాయి. అందులో భాగంగానే ఓ యువతిని కూడా టికెట్ చూపించమని అడిగారు. సదరు యువతి తన దగ్గర టికెట్ లేదని చెప్పింది. అరుస్తూ, ఏడుస్తూ, టికెట్ తనిఖీ సిబ్బందితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులతో వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు ఆమె హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నారు. టికెట్ చూపించి తమకు సహకరించాలని కోరారు. సదరు యువతి ఆందోళనతో ఆగమాగం చేసింది. “నేను పారిపోవడం లేదు, నా పరిస్థితిని మీరు చూడలేదా? అంటూ అరిచింది. “టికెట్ చూపించండి.. లేదంటే ఫైన్ కట్టండి” అని అధికారులు అనడంతో “మీ క్యూఆర్ కోడ్ ఇవ్వండి, నేను త్వరగా వెళ్లాలి” అంటూ హంగామా చేసింది. రద్దీగా ఉన్న బ్రిడ్జి మీద గొడవ జరిగినప్పటికీ, రైల్వే సిబ్బంది ఆమెతో ప్రశాంతంగా వ్యవహరించారు. సదరు యువతి నుంచి జరిమానా కట్టించుకున్నారు. న్యూసెన్స్ కు సంబంధించి ఏదైనా చర్యలు తీసుకున్నారా? అనే విషయం తెలియలేదు.
Travelling in train without a valid ticket is an offence with jail or fine or both. But, this woman in Mumbai who was without ticket when stopped by TTE , allegedly started creating a scene and started playing gender card.
Btw , who is that turban man and why is he stopping her… pic.twitter.com/mpzBgH9RTS
— Amitabh Chaudhary (@MithilaWaala) August 4, 2025
బోరివాలిలో టీసీపై ప్రయాణీకుడి దాడి
రీసెంట్ గా ముంబై బోరివాలి రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం సమయంలో ఈ చెకింగ్స్ కొనసాగాయి. అధికారులు నలుగురు ప్రయాణీకులను పట్టుకున్నారు. వారందరినీ దాదర్-విరార్ లోకల్ రైలు నుంచి దిగమని చెప్పారు. ముగ్గురు ప్రయాణికులకు సెకండ్ క్లాస్ టిక్కెట్లు ఉన్నప్పటికీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తుండగా, ఒక ప్రయాణీకుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. వారందరినీ టికెట్ చెకర్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ప్రయాణీకులలో ఒకరు బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆఫీస్ లోని కీబోర్డులు, మానిటర్లు, ఇతర కంప్యూటర్ పరికరాలను ధ్వంసం చేశాడు. రైల్వే సిబ్బంది అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ.. వారిపై గట్టిగా అరుస్తూ దాడికి దిగాడు. టికెట్ చెకర్లలో ఒకరి పైన కూడా దాడి చేశాడు. అతడి దాడిలో మరో ప్రయాణీకుడు కూడా గాయపడ్డాడు. చట్టపరంగా అతడిపై చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడమే నేరం కాగా, రైల్వే సిబ్బందిపై దాడి చేయడంతో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం సీరియస్ అంశం అన్నారు. సదరు వ్యక్తిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రైల్వే ఉద్యోగులపై దాడులు చేసినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని రైల్వే పోలీసులు హెచ్చరించారు.
Read Also: పాకిస్తాన్ రైళ్లు ఇంత దారుణమా.. ఈ బోగీలను పాత సామాన్లవాడు కూడా కొనడేమో!