Telangana Weather News: తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా గత మూడు, నాలుగు రోజుల నుంచి దంచికొట్టింది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో కుండపోత వాన కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్‌లో వాన పడింది. గడిచిన రెండు నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా వర్షం కురిసింది. మొన్న ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.45శాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో జనం నరకం చూశారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. డే అంతా సూర్యుడు ప్రతాపం చూపిస్తుంటే.. సాయంత్రం కాగానే వరుణుడు చుక్కలు చూపిస్తు్న్నాడు. ముఖ్యంగా వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది.
మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ లో సాయంత్రం, రాత్రి వేళల్లో పలు చోట్లు మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పారు.
ALSO READ: Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు
మరి కాసేపట్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగామ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మరి కొన్ని క్షణాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్పారు. హైదరాబాద్ లో సాయంత్రం వేళ అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: ECIL Hyderabad: హైదరాబాద్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చుడే, డోంట్ మిస్