BigTV English

SDT: సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ.. దిగ్గజాలంతా ఒకే చోట.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా.?

SDT: సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ.. దిగ్గజాలంతా ఒకే చోట.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా.?

SDT:మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) తాజాగా నటిస్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’.. అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నామని మొదట మేకర్స్ ప్రకటించినా.. ఆ తర్వాత పలు కారణాలవల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సాయి దుర్గ తేజ్ అభిమానులు కూడా కాస్త నిరాశలో ఉన్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే సంబరాల ఏటిగట్టు సినిమా విడుదల వాయిదా పడినా.. ఇలాంటి సమయంలోనే ఒక అదిరిపోయే న్యూస్ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తోంది. ఒకే చోట దిగ్గజాలంతా కలిసి సాయి దుర్గా తేజ్ తో కొత్త సినిమా చేయడానికి సిద్ధమైనట్లు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో ఓ వార్త వినిపించడంతో ప్రస్తుతం ఈ విషయం మీడియాలో హైలైట్ గా మారింది.. మరి ఆ సినిమా ఏంటి.. ? ఎవరెవరు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు? డైరెక్టర్ ఎవరు? నిర్మాత ఎవరు? కథ ఎవరు అందిస్తున్నారు? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


త్వరలో సాయి దుర్గా తేజ కొత్త మూవీ ప్రకటన..

వంశీకృష్ణ దర్శకత్వంలో మారుతీ అందిస్తున్న కథలో సాయి దుర్గ తేజ్ హీరోగా ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి ఓ టాక్ వినిపిస్తోంది.అలాగే ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ విషయం లీక్ అవ్వడంతో దిగ్గజాలంతా ఒకేచోట చేరారు..సాయి దుర్గ తేజ్ కి బ్లాక్ బస్టర్ గ్యారంటీ పో అంటూ కొంతమంది మెగా ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇక దిగ్గజ డైరెక్టర్ వంశీకృష్ణ దర్శకత్వానికి మారుతీ కథ జోడించడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. అలాగే రీసెంట్ గా మిరాయ్ మూవీ తో హిట్ కొట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సినిమా తెరకెక్కడం మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. అలా దిగ్గజాలంతా కలిసి ఒకే చోట పనిచేయడంతో సాయి దుర్గ తేజ్ నెక్స్ట్ సినిమాపై భారీ హైప్ నెలకొంది.

గంజా శంకర్ కంటే ముందే..


సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు మూవీ షూటింగ్ తో పాటు ఆయన గతంలో ప్రకటించిన గంజా శంకర్ మూవీ కూడా వాయిదా పడింది.ఈ సినిమా టైటిల్ వివాదాస్పదంగా ఉంది అనే వార్తలు వినిపించాయి. ఇప్పటి వరకు గంజా శంకర్ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ మళ్లీ ఇవ్వడం లేదు. గంజా శంకర్ సినిమా కంటే ముందే వంశీకృష్ణ డైరెక్షన్లో సాయి దుర్గ తేజ్ నటించే సినిమా విడుదలవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఒక సినిమా వాయిదా పడిందని నిరాశ పడేలోపే.. మరొక కొత్త మూవీ ప్రకటించబోతున్నారని త్వరలోనే అధికారికంగా అనౌన్స్మెంట్ ఉంటుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

also read: Sunny leone : మళ్లీ యూటర్న్ తీసుకున్న సన్నీలియోన్.. రిస్క్ చేస్తోందా?

Related News

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Mirai vs Kishkindhapuri: లెక్కలు మారుతున్నాయి… ఈ వీకెండ్ ఏం జరుగుతుందో ?

Sunny leone : మళ్లీ యూటర్న్ తీసుకున్న సన్నీలియోన్.. రిస్క్ చేస్తోందా?

OG Pre Release Event: రేపే ప్రీ రిలీజ్‌ ఈవెంట్… పవన్‌ కోసం రెండు స్టేజ్‌లు.. అసలు సంగతేంటంటే ?

OG Premiere : తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. ఓజీ సినిమాపై గందరగోళం!

Ramgopal Varma: శివ రీ రిలీజ్… వర్మ షాకింగ్ రియాక్షన్ …పిల్లల సినిమా కాదు కానీ!

Big Stories

×