Big Stories

Traffic: హైదరాబాద్ వాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్‌

Traffic: మామూలు రోజుల్లోనే హైదరాబాద్ నడిబొడ్డున ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా పంజాగుట్ట, ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్, అబిడ్స్, లక్డీకాపూల్, మెహదీపట్నం రూట్లలో ఎక్కువ వెహికిల్ మూమెంట్ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ఖైరతాబాబ్, ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ఏరియాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. కిలోమీటర్ వెళ్లాలంటే 40 నిమిషాలకు పైనే పడుతోంది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ లోనే చిక్కుకుపోతున్నారు జనాలు.

- Advertisement -

ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం నెక్లెస్ రోడ్ లోని ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌తో సమస్యలు పెరిగిపోయాయి. ట్రాఫిక్ కంట్రోల్ కోసం కొన్ని రూట్లు మూసేశారు. రేసింగ్ జరిగే ఎన్టీఆర్ మార్గ్ టోటల్‌గా క్లోజ్ అయింది. చుట్టూ తిరిగి రావడం, అదే సమయంలో వేర్వేరు రూట్లలో వెళ్లాల్సిన వెహికిల్ అన్నీ ఒక చోటికి చేరుతుండడంతో రద్దీ భారీగా పెరిగిపోయింది. మంగళవారం నుంచి పరిస్థితి మరింత చేయిదాటిపోతున్నట్లుగా కనిపిస్తోంది. పంజాగుట్ట ఖైరతాబాద్ మీదుగా అబిడ్స్ వెళ్లాలంటే పావుగంట సరిపోయేది. కానీ ఇప్పుడు గంటకు పైగా టైం పడుతోంది.

- Advertisement -

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా ఈ రేస్… కామన్ పబ్లిక్‌కు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి రేస్ హైదరాబాద్‌కు మంచి పేరు తీసుకొస్తుంది. దాన్ని కాదనేవారు ఎవరూ లేరు. కానీ దీన్ని తీసుకొచ్చి సిటీ నడిబొడ్డున పెట్టడమే ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. గతేడాది ఇండియన్ రేసింగ్ లీగ్, అలాగే ఫార్ములా లెవల్ 3 కార్ల రేస్ జరిగింది. దీన్ని సాధారణ జనాలు ఎంజాయ్ చేయడం మాట అటుంచితే.. ఈ రూట్లలో వెళ్లే వారికి మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. ట్యాంక్ బండ్ దగ్గర పెట్టిన ట్రాఫిక్ ఆంక్షల ఎఫెక్ట్ అటు మెహదీపట్నం అత్తాపూర్, ఇటు రేతిబౌలి వరకూ కనిపిస్తోంది. ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూసేశారు. దీంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లిబర్టీ, హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కవాడిగూడ రూట్లలో భారీగా ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతోంది.

సీన్ కట్ చేస్తే కామన్ పబ్లిక్ ట్రాఫిక్ అనుమతించకపోవడంతో ఐమ్యాక్స్‌లో మూవీ షోలు రద్దు చేశారు. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్‌ను మూసేశారు. శనివారం రోజున ఫార్ములా ఈ రేసింగ్ జరగనుంది. దీంతో అటు వైపు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ కూడా మూసేశారు. ఎటు చూసినా ట్రాఫిక్ పద్మవ్యూహమే కనిపిస్తోంది. ఏ రూట్లో వెళ్తే ఎక్కడ ఇరుక్కుపోతామోనన్న భయంతో వాహనదారులున్నారు. మరోవైపు ఈనెల 15 వరకు నుమాయిష్ జరగనుంది. అలాగే ఈనెల 17న కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఉంది. ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు, వీఐపీల మూవ్ మెంట్ పెరగడంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆఫీసులకు వెళ్లి వచ్చే వారికైతే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలా వరుస ఈవెంట్లతో ఈ రూట్లన్నీ మరో వారం పది రోజుల దాకా బిజిబిజీగా ఉంటాయంటున్నారు.

హైదరాబాద్ లో 80 లక్షలకు పైగా వెహికిల్స్ ఉంటాయి. వీటిలో రోజూ 30 నుంచి 40 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. రోజూ రకరకాల ఉల్లంఘనలతో 17 వేల వరకు చలాన్లు జెనరేట్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఇంతలా ట్రాఫిక్ నరకం కనిపిస్తుంటే… పోలీసులు నియంత్రించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు సిటీ నడిబొడ్డున ఫార్ములా రేసింగ్‌లు ఏంటని కామన్ పబ్లిక్‌లో అసహనం పెరుగుతోంది. సిటీ బయట పెట్టుకోవచ్చు కదా అన్న వాదన పెరుగుతోంది. కొందరైతే రోడ్డుపైనే ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి ఉంది.

ఈ రేస్ పుణ్యమా అని పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేశారు. అయితే కాంట్రాక్టర్లకు చాలా చోట్ల బిల్లులు అందడం లేదు. అలాగే గ్రేటర్ ఖజానా ఖాళీఖాళీగానే ఉంటోంది. ఇలాంటి మెగా ఈవెంట్లకు భారీ ఖర్చులు ఒకవైపు, బిల్లులు రాక సమస్యలు మరోవైపు, ట్రాఫిక్ వలయం ఇలా రోజురోజుకూ సమస్యలు పెరుగుతూ పోతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News