Hideathon 2025: ఇప్పటి యువతకు సామాజిక మార్పును సృష్టించాలనే తపన ఉంది. కానీ అది ఎలా చేయాలి? ఎక్కడ ప్రారంభించాలి? అనేది తెలియక చేతులెత్తేస్తుంటారు. అలాంటి ప్రతిభావంతుల కోసం ఇప్పుడు ఓ గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది Hideathon 2025. యువతలో ఉన్న ఐడియాలను ఆచరణలో ఉంచాలన్న లక్ష్యంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి వేదికైంది ఓరియెంటేషన్ సెషన్. దీనిని జూలై 19న హైదరాబాద్‌లోని నారపల్లి, ఘట్‌కేసర్ వద్ద ఉన్న సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో జరుపుతున్నారు. మరింత ప్రాముఖ్యతగా, ఈ కార్యక్రమానికి BIGTV మీడియా భాగస్వామిగా ఉండడం విశేషం.
కొత్త ఆలోచనలకు స్వాగతం.. BIGTV ప్రోత్సాహం!
BIGTV నేటి యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే విధంగా వార్తలు, అవకాశాలు అందించడంలో ముందుంటోంది. కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలకు వేదికగా నిలిచే కార్యక్రమాలకు మద్దతుగా ఉండే ఈ సంస్థ, Hideathon వంటి మార్పుకు ఊతమిచ్చే కార్యక్రమానికి మీడియా భాగస్వామిగా ఉండటం గర్వకారణం. ఇది కేవలం ఓ ఈవెంట్ మాత్రమే కాదు.. యువతలో మార్పు మొదలయ్యే మొదటి మెట్టు. అందుకే BIGTV వంటి బాధ్యతాయుతమైన మీడియా భాగస్వామ్యం ద్వారా ఇది మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి చేరనుంది.
ఈ సెషన్ మీకోసం.. మీ భవిష్యత్ కోసం!
Hideathon 2025 ఓరియెంటేషన్ ఒక సాధారణ కార్యక్రమం కాదనే విషయాన్ని యువత గమనించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇందులో పాల్గొనదలచిన యువతకు పూర్తి క్లారిటీ అందించేందుకు నిర్వహకులు ప్రత్యేకంగా ఈ సెషన్‌ను ఏర్పాటుచేశారు. మీ దగ్గర ఓ ఆలోచన ఉన్నా సరే.. మీరు ఈ కార్యక్రమంలో తెలుపవచ్చు. పైగా, ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదు. ఎంట్రీ పూర్తిగా ఉచితం, అలాగే పాల్గొనేవారికి ఫ్రీ స్నాక్స్, ఫన్ యాక్టివిటీస్, సర్ప్రైజ్ గిఫ్ట్స్ లాంటి ఆకర్షణీయ కార్యక్రమాలు సైతం ఉన్నాయి.
ఇక్కడ ఏం జరుగుతుంది?
ఈ ఓరియెంటేషన్‌లో మీకు ఏమి లభిస్తుందంటే, Hideathonకి ఎలా రిజిస్టర్ అవ్వాలి? సెలెక్షన్ ప్రక్రియ ఏంటి? మెంటరింగ్, ఇంక్యూబేషన్, ఫండింగ్ వంటి సహకారాలు ఎలా లభిస్తాయనే విషయాలపై పూర్తి అవగాహన పొందొచ్చు. 50కి పైగా టాప్ ఇంక్యూబేటర్లు, మార్గదర్శకులు, స్టార్ట్‌అప్ మెంటర్లు ఈ కార్యక్రమంతో కనెక్ట్ అవుతారు. ఇవన్నీ మీ కెరీర్‌ను ఓ కొత్త దిశగా నడిపించే అవకాశాలే. అంతేకాదు, BIGTV పార్టనర్‌గా ఉండడం వల్ల ఈ ఈవెంట్‌లో మీ ప్రాతినిధ్యం మిగిలిన ప్రపంచానికి కనిపించేలా మారుతుందని చెప్పవచ్చు.
ముఖ్య అతిధిగా శేఖర్ కమ్ముల..
ఈ కార్యక్రమానికి మరింత హైప్ అందించే అంశం ఏంటంటే.. విశిష్ట అతిథిగా దర్శకుడు శేఖర్ కమ్ముల హాజరుకానున్నారు. యువత, సృజనాత్మకత, సామాజిక మార్పు వంటి అంశాల్లో ఆయనకు ఉన్న అవగాహన, సమాజంపై చూపే దృష్టిని మనం ఆయన సినిమాల ద్వారానే పలు మార్లు చూశాం. అలాంటి వ్యక్తి ఓరియెంటేషన్‌కి ముఖ్య అతిథిగా రావడం.. ఎంతో మంది యువతలో స్పూర్తిని ఇస్తుందన్నది నిర్వాహకుల అభిప్రాయం. ఆయన సందేశాలను BIGTV, యువత ముందుకు చేరవేస్తూ మరింత ప్రభావవంతంగా మార్చనుంది.
Also Read: Visakhapatnam railway station: స్టేషన్‌కే కొత్త లుక్.. విశాఖ ట్రావెలర్స్‌కు డబుల్ ధమాకా!
ఇంకా చెప్పాలంటే, ఈ ఓరియెంటేషన్ బాగా ఆలోచించేలా చేసే యాక్టివిటీలు, ఆలోచనలకు ప్రాక్టికల్ రూపమివ్వడానికి జరిగే ఇంటరాక్టివ్ సెషన్లు, మీలో ఉన్న లీడర్‌ను బయటకు తేవడానికే రూపొందించబడ్డాయి. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా, స్టార్ట్‌అప్ బిల్డర్ అయినా, లేదా మీకు ఓ వినూత్న ఆలోచన ఉన్నా.. ఈ ఓరియెంటేషన్ మీకు తప్పక సహాయపడుతుంది.
BIGTV వంటి మీడియా పార్టనర్ ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ యువతి, యువకుడి ఐడియా ఫోకస్‌లోకి వస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఓ డైరీ నోట్ తీసుకునే రోజు కాదు.. మీ ప్రయాణం మొదలయ్యే రోజు. దాని మొదటి మెట్టు Hideathon ఓరియెంటేషన్ గా చెప్పవచ్చు. BIGTV దీనిని యువత శక్తిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. మీరు వేసే ఈ చిన్న అడుగు.. రేపటి మార్పు కావచ్చు.
సాయంత్రం వరకు ఇంట్లో కూర్చుని మొబైల్‌లో స్క్రోల్ చేయడం కాదు.. మీ కలలవైపు అడుగులు వేయాల్సిన సమయం ఇది. జూలై 19, 2025.. మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు కావొచ్చు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ, నారపల్లి, ఘట్‌కేసర్ అక్కడికి చేరండి. మీలోని మార్పు కనబడేలా చేయండి. BIGTV తోడుగా ఉంది.. ఇక మీ మెదడుకు పదును పెట్టండి బాస్!