BigTV English

TSPSC: గ్రూప్ 2 తేదీపై సోమవారం ఫైనల్.. తేల్చేయాలని TSPSCకి కోర్టు ఆదేశం..

TSPSC: గ్రూప్ 2 తేదీపై సోమవారం ఫైనల్.. తేల్చేయాలని TSPSCకి కోర్టు ఆదేశం..
tspsc group 2

TSPSC: గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనేది సోమవారం చెప్పాలంటూ TSPSCని ఆదేశించింది. దీంతో మండే రోజు పరీక్ష నిర్వహణపై అటో ఇటో తేలిపోనుంది.


గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. మిగిలిన పరీక్షల కారణంగా గ్రూప్‌2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును అభ్యర్థించగా.. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సమయంలో వాయిదా కష్టమని TSPSC వాదనలు వినిపించింది. అయితే, గ్రూప్‌-2 పరీక్ష నిర్వాహణపై సోమవారం స్పష్టమైన ప్రకటన చేస్తామని హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కచ్చితంగా ఆ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. సోమవారానికి విచారణ వాయిదా వేసింది కోర్టు.

ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే.. గ్రూప్‌-2 పరీక్ష ను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల టీచర్ తో పాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చర్ల పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అగస్ట్ 2నుండి 30వరకు రకరకాల పరీక్షలు ఉన్నాయని.. గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంలో 90 శాతం మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష నిర్వయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని కోర్టుకు తెలిపారు.


అయితే, తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారుని.. కానీ గురుకుల్ పరీక్ష కు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని TSPSC కోర్టుకు తెలిపింది. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. ఎంపిక చేసిన 1,535 సెంటర్లలో పరీక్ష నిర్వహించే రోజు సెలవులు ప్రకటించామని తెలిపింది. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో పిటిషన్ వేసింది కేవలం 150 మంది మాత్రమే అని గుర్తు చేసింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×