Diesel Theft: హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఇప్పుడు ఈ ముఠా లారీడ్రైవర్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పాపం, లాంగ్ జర్నీ చేసి అలసిపోయిన డ్రైవర్లు కాసేపు కునుకు తీద్దామని లారీని పక్కకు పార్క్ చేస్తే చాలు.. నిమిషాల్లో ట్యాంక్ ఖాళీ అయిపోతోంది. నార్కట్‌పల్లి – చిట్యాల మధ్య డీజిల్ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వీళ్ల రూటే సపరేటు. లగ్జరీ కార్లలో వస్తారు, లారీ పక్కన ఆపుతారు. డ్రైవర్ నిద్రపోతున్నాడని కన్ఫర్మ్ చేసుకోగానే, పెద్ద పెద్ద క్యాన్లు తెచ్చి ట్యాంక్‌లోని డీజిల్ మొత్తాన్ని లాగేస్తున్నారు.
డీజిల్ దొంగతనాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో క్లియర్‌గా రికార్డ్ అయ్యాయి. కార్లలో వచ్చి క్యాన్ల కొద్దీ డీజిల్ ఎత్తుకెళ్తున్న విజువల్స్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఈ వరుస చోరీలతో ఇప్పుడు లారీ డ్రైవర్లు హైవేపై బండి ఆపాలంటేనే వణికిపోతున్నారు. డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో.. వేల రూపాయల డీజిల్ ఒక్క రాత్రిలో మాయమైపోతే ఆ నష్టం డ్రైవర్లు, ఓనర్లు ఎలా భరిస్తారు? నిద్ర లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయనే ముప్పు ఒక పక్క, నిద్ర పోతే- డీజిల్ దొంగల తలనొప్పి మరోపక్క తమను వేధిస్తున్నట్టు వాపోతున్నారు డ్రైవర్లు.
Also read: YS Jagan: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్.. హీటెక్కిన ఏపీ రాజీకీయం!
హైవే పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయంలో వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు నెంబర్లను గుర్తించి, ఈ హైటెక్ డీజిల్ దొంగల ముఠాను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి లారీ ఓనర్ల అసోసియేషన్లు డిమాండ్లు చేస్తున్నారు.
Storey By:Appa Rao Big Tv
Also Read: School Controversy: హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త!