E-Paper
Advertisement

నియోపోలిస్ ప్లాట్ 17 మళ్ళీ వేలం, చేతులెత్తేసిన వజ్ర కన్స్ట్రక్షన్స్, అప్పట్లో ఎకరా రూ.136 కోట్లకు కొనుగోలు

నియోపోలిస్ ప్లాట్ 17 మళ్ళీ వేలం, చేతులెత్తేసిన వజ్ర కన్స్ట్రక్షన్స్, అప్పట్లో ఎకరా రూ.136 కోట్లకు కొనుగోలు
Advertisement

Neopolis: కోకాపేట్ భూముల వేలంలో ఏం జరుగుతోంది? నియోపాలిస్ ఫేజ్-3లో ఎకరా రూ.136 కోట్లకు కొనుగోలు చేసిన ఆ కంపెనీ ఏమైంది? వజ్ర కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎందుకు డ్రాపైంది? ఆ భూములను మళ్లీ వేలం వేసేందుకు హెచ్ఎండీఏ రెడీ అయ్యింది. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

 

నియోపోలిస్ ప్లాట్ 17లో భూములు మళ్ళీ వేలం

Advertisement

హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ-HMDA గతేడాది నవంబర్ 24న కోకాపేట్‌లో అతిపెద్ద భూముల వేలం నిర్వహించింది. వేలంలో ఎకరం ధర అత్యధికంగా రూ.136 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18 భూములు ధరలు రికార్డు ధర నమోదైంది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉంది. అందులోని ఎకరా రూ.136 కోట్లకు పైగా బిడ్ వేసి గెలుచుకుంది వజ్ర కన్స్ట్రక్షన్స్.

 

చేతులెత్తేసిన వజ్ర కన్స్ట్రక్షన్స్

Advertisement

హైదరాబాద్‌లో ఈ స్థాయి ఎప్పుడూ పలకలేదు.. ఏ నిర్మాణ కంపెనీలు ఆ స్థాయిలో బిడ్డింగ్ వేసేందుకు ముందుకు రాలేదు. కానీ వజ్ర కన్స్ట్రక్షన్స్ మాత్రం ఈ విషయంలో కాస్త దూకుడుగా వెళ్లింది. దాని వెనుక ఎవరున్నారు అనేది తర్వాత మాట. వాళ్ల వద్ద మూలధనం కొంత వుందని, మిగిలిన మొత్తాన్ని ఓటీపీ అమ్మకాల ద్వారా సమీకరించాలని భావించారని వార్తలు వస్తున్నాయి.

ఓటీపీ అంటే ముందస్తుగా కస్టమర్ల నుంచి వసూలు చేసిన నిధులను హెచ్‌ఎమ్‌డీఏకు చెల్లించవచ్చని ఆ సంస్థ ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులు, భారీ మొత్తాన్ని గడువులోగా సర్దుబాటు చేయడం అసాధ్యమని డిసైడ్ అయ్యింది. చివరకు ఆ వేలం నుంచి డ్రాప్ అయ్యింది.

 

అప్పట్లో ఎకరా రూ.136 కోట్లకు కొనుగోలు

నిజానికి వేలం ప్రారంభమైన రోజు సదరు కంపెనీ ఆర్థికస్థితిని పలువురు రియల్టీ నిపుణులు అంచనా వేశారు. తప్పుదోవ పట్టించేందుకు భారీ బిడ్డింగ్ వేశారని అప్పట్లో వాదనలు బలంగా వినిపించాయి. చివరకు వారు అన్నట్లుగా జరిగింది. సదరు సంస్థ డిపాజిట్ చేసిన రూ.5 కోట్ల డిపాజిట్ నిధులను హెచ్‌ఎమ్‌డీఏ జప్తు చేసింది.

ALSO READ: ఎల్బీ‌నగర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. మృతుని కుటుంబసభ్యుల ఆందోళన

తాజాగా ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఇప్పుడు కొత్తగా వేలం నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. హెచ్ఎండీఏ ఈ తరహా పెద్ద ప్రాజెక్టులపై సమర్థులైన డెవలపర్లు బిడ్లు వేసేలా అర్హత ప్రమాణాలు పెడితే బాగుంటుందని అంటున్నారు రియాల్టీ నిపుణులు. మరి ఈసారి ఆ భూముల ధరలకు ఎంతకు వెళ్తాయో చూడాలి.

Related News

కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

Big Stories

Advertisement
×