E-Paper
Advertisement

HSRP Number Plate: ఖనిజ రవాణా వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్.. ఇవి పాటించకపోతే వాహనం సీజ్..!

HSRP Number Plate: ఖనిజ రవాణా వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్.. ఇవి పాటించకపోతే వాహనం సీజ్..!

HSRP Number Plate: ఇక ఖనిజ రవాణా చేసే వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి. ఏ వాహనంకు అయినా హెచ్ఎస్ఆర్సీ ప్లేట్ లేకుంటే జరిమానా విధించనున్నారు. అయినా తీరుమారకపోతే నెంబర్ ను బ్లాక్ చేయడంతో పాటు వాహనం సీజ్ చేస్తారు. వాహనం నడిపే వ్యక్తిపైనా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ప్రభుత్వం ఖనిజ అక్రమరవాణాకు అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి వాహనానికి హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ తప్పని సరి చేసింది. ఈ నెంబర్ ప్లేట్ తో ఖనిజ రవాణా వాహనాల గుర్తింపు, పర్యవేక్షణ, అనుమతుల ధృవీకరణ, అక్రమ రవాణా పై నియంత్రణ మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి దోహదపడనుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసి నెల రోజుల సమయం పెట్టింది. ఫిబ్రవరి 28 నుంచే అమల్లోకి వస్తుందని మైనింగ్ శాఖ జారీ చేసిన జీవోలో పేర్కొంది.

ప్రమాదాలు జరిగిన సమాయాల్లో..

రాష్ట్రంలో ఖనిజ రవాణా చేసేవాహనాలు(లారీలు, టిప్పర్లు, డంపింగ్ టిప్పర్లు, ట్రాక్టర్లు) తరలిస్తున్నాయి. ఇసుక రీచ్ ల నుంచి, మైనింగ్ గనుల నుంచి, కంకర యార్డులు,మినరల్ డీలర్ యూనిట్లు, స్టాక్ యార్డుల నుంచి రావాణా చేస్తుంటాయి. 90శాతం ఖనిజా రవాణా చేసే వాహనాలకు నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడంతో వాటిని గుర్తించడం అధికారులకు ఇబ్బందిగా మారుతుంది. ప్రమాదాలు జరిగిన సమాయాల్లోనూ, అక్రమ ఇసుకరవాణా, కంకర తరలించే వాహనాలను గుర్తించడంలోనూ కష్టతరంగా మారింది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకే తాత్కాలిక అనుమతి ప్రాంతాల నుంచి ఖనిజ రవాణా చేసే అన్ని వాహనాలు. ప్రతి వాహనానికి ముందు ,వెనుక భాగంలో రవాణా శాఖ నిబంధనల ప్రకారం హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ప్లేట్లు తప్పనిసరిగా అమర్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు వాహనం సైడ్లలో సైతం నెంబర్ ప్లేట్ ఉండాలని జీవోలో పేర్కొంది.

హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్..

హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ ఏర్పాటు బాధ్యత సంబంధిత వాహనదారుడే అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనానికి మాత్రమే ఇసుక బుకింగ్ గానీ, కంకర, రాళ్ల తరలింపునకు అవకాశం కల్పిస్తున్నది. నంబర్ ప్లేట్లు స్పష్టంగా కనిపించేలా, చెడిపోకుండా, ఎలాంటి ట్యాంపరింగ్ లేకుండా ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. అంతే కాదు హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ లేని వాహనానికి ఖనిజ తరలింపు అనుమతి ఇవ్వడం లేదని ఓ అధికారి తెలిపారు. ఈ-పర్మిట్ జారీ సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీటీవీ, ఏఎన్పీఆర్ సిస్టమ్స్ ద్వారా తనిఖీ చేయననున్నారు. హెచ్ఎస్ఆర్పీ లేకుండా లేదా, దెబ్బతిన్న, నకిలీ ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు ePermit సిస్టంలో బ్లాక్ చేయనున్నారు. పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించే వరకు ఎలాంటి పర్మిట్ లేదా డిస్పాచ్ అనుమతించబడదని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.

Also Read: Gas cylinder: పేలుడు భయం లేదు.. తుప్పు పట్టే ఛాన్స్ లేదు: మీ వంటశాల కోసం సురక్షితమైన ‘నెక్స్ట్ జెన్’ సిలిండర్లు

రాంగ్ రూట్‌లో..

లారీ యజమానులు ఇప్పటివరకు నెంబర్ ప్లేట్లను సరిగ్గా ఏర్పాటు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లారీ యాజనులు, టిప్పర్ల యజమానులు వాహనాలకు నెంబర్ల ప్లేట్లు సరిగ్గా ఉండకపోవడంతో ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడం.. నోపార్కింగ్.. రాంగ్ డైరెక్షన్ సమయంలో ఫైన్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఇసుక, మైనింగ్, క్రషర్ల దగ్గర నెంబర్ సరిగ్గా లేకపోతే నెంబర్ ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉంది..అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకే వేబిల్లుపై రెండుమూడు లోడ్లు ఖనిజ రవాణా చేస్తుండటం, ఒక వాహనంకు బదులు మరోవాహనానికి రాంగ్ రూట్ లో వచ్చినందుకు, నోపార్కింగ్ లో వాహనం పెట్టారనే చలాన్లు వస్తుండటం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ హెచ్ఎస్ఆర్పీ నెంబర్ ప్లేట్ల విధానాన్ని అమలులోకి తెస్తున్నారు.

శాశ్వతంగా బ్లాక్ లిస్ట్..

గనులు శాఖ నిర్ణయించిన ప్రకారం జరిమానాలు విధించబడతాయని జీవోలో పేర్కొన్నారు. ప్రస్తుతం రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే వెయ్యి నుంచి 2 వేలు జరిమానా విధిస్తున్నారు. పదేపదే తప్పులు చేస్తే, అధిక జరిమానాలు విధించబడటంతో పాటు. వాహనం లేదా ఆపరేటర్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో వరంగల్ సీపీగా పనిచేసినప్పుడు నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోతే రంగనాథ్ చీట్ కేసులు నమోదు చేసి కోర్టుకు పంపించారు. దీంతో వరంగల్ లో నెంబర్ ప్లేట్లు సరిచేశారు.

జీవో జారీ..

రవాణాశాఖ నెంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం మోపాల్సి ఉంది. నెంబర్ ప్లేట్ సరిగ్గాలేని వాహనాలపై జరిమానా విధించాల్సి ఉంటుంది. వాటిపై నిఘా పెట్టాల్సి ఉంది. అయితే వారు చర్యలు తీసుకోకపోవడంతో మైనింగ్ శాఖ రంగంలోకి దిగినట్లు స్పష్టమవుతోంది. ఖనిజ రవాణాచేసే వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ తప్పని సరి అని జీవో జారీ చేయడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఈ విధానంతో అక్రమ ఖనిజరవాణాకు చెక్ పడనుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సైతం పెరిగే అవకాశం ఉంది.

Also Read: TDP : బూతు పార్టీ నేతలకు బుద్ధి చెప్పారా?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×