P Lapsika: క్రీడల్లో గ్రామీణ ప్రాంత గురుకుల విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. స్థానిక కేసీ క్యాంపులోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థిని పి. లాప్సిక ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, హుజురాబాద్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్మల్ జిల్లా బీబీనగర్ వేదికగా జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ (SGFI) అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో లాప్సిక అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. పోటీల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ తన ప్రతిభతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి, జాతీయ స్థాయి జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకుంది.
జాతీయ స్థాయికి ఎంపికైన లాప్సికను పాఠశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి శారద, పీఈటీ చిరుత కవిత, ఉపాధ్యాయ బృందం, తోటి విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
Also Read: బిగ్ స్క్రీన్ మ్యాజిక్..ఇండియాలో హిసెన్స్ E7S మినీ ఎల్ఈడీ టీవీలు లాంచ్!