E-Paper
Advertisement

సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!

సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!
Advertisement

Bullet Train: దేశంలో ఏడు బుల్లెట్ ట్రైన్ కారిడార్ల ప్రతిపాదనల్లో.. హైదరాబాద్ కేంద్రంగా మూడు మార్గాలను ప్రతిపాదించారు. శంషాబాద్ నుంచి బెంగళూరు, ముంబైతో పాటు NH-65 మీదుగా అమరావతి, చెన్నై వైపు మరో కారిడార్‌ను ప్రతిపాదించినట్టు స్థానిక ఉద్యమకారులు చెబుతున్నారు. అయితే తాజాగా శంషాబాద్ నుంచి నల్గొండ జిల్లా మీదుగా దామరచర్ల వైపు అలైన్‌మెంట్ మార్చే ప్రతిపాదనలు వచ్చాయన్న ప్రచారం మొదలైంది. దీంతో NH-65 వెంట ఉన్న పట్టణాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సూర్యాపేటలో రిలే నిరాహార దీక్షలు

Advertisement

చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, మునగాల ప్రాంతాల ప్రజలు ఉద్యమ బాట పట్టారు. జూలై 19 నుంచి అఖిలపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు, నిరసనలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్‌ను NH-65 వెంటనే కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులకు వినతులు అందజేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు

Advertisement

రూట్ మార్పు వెనుక రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్నాయంటూ ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు, ఇతర పార్టీలు కూడా ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. బుల్లెట్ ట్రైన్ రూట్ ఎటువైపు ఖరారవుతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Also Read: ఉక్రెయిన్ బస్టాప్‌పై రష్యా బాంబుల వర్షం.. 33 మంది మృతి!

Tags

Related News

‘మోదీ గారూ కళ్ళు తెరవండి’.. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

మద్యానికి బానిసై.. భూమి కోసం కన్నతండ్రిని బండరాయితో బాది చంపిన కొడుకు!

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

Big Stories

Advertisement
×