E-Paper
Advertisement

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Prakash Raj: ఆయన వేసే ఒక్క ప్రశ్నకు వేల తిట్లు, విమర్శలు. వాటిని ఎదుర్కోవడం కూడా అతనికి అలవాటే. నటనారంగంలో అతనిదో ప్రత్యేక శైలి. రాజకీయంగా మరోలోకం. దీనికి దానికి లింకు పెట్టాలనుకోరు. కానీ పెట్టేస్తారు. తిట్టేస్తారు. గెంటేస్తారు. అవకాశాలు ఇవ్వం పో అని బెదిరిస్తారు. నీది ఏ రాష్ట్రం రా..! అని కూడా తిట్టిపోస్తారు. అయినా డోంట్‌ కేర్‌ అంటారు ప్రకాశ్‌. చిరంజీవిని నటనా పరంగా అమితంగా ప్రేమిస్తారు. అతని తమ్ముడిని రాజకీయంగా విబేధిస్తారు. సిద్దాంతపరంగా ఎంతటి వారితోనైనా ఢీ కొట్టేందుకు రెడీ అవుతారు.

ముహూర్తం ఫిక్స్‌..

ప్రధానంగా మోడీ అనుకూల బ్యాచంటే ఒళ్లంతా కాక్రోచులు పాకినంతగా చికాకు పడతారు ప్రకాశ్‌ రాజ్‌. మోడీ యాంటీ గ్రూపంటే.. రాసుకు పూసుకు తిరగడమే కాదు. వారిని డిఫెన్స్‌ నుంచి రక్షించేందుకు తనో రక్షణ కవచంలా నిలబడతారు. తగుదునమ్మా అంటూ వచ్చి వాలుతాడు సోషల్‌ మీడియాలో మాటల దాడి మొదలుపెడతారు. విమర్శల అస్త్రాలు సంధిస్తారు. మొన్న జంతర్‌ మంతర్ దగ్గర ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించేదాకా వదలని బొద్దింకల బ్యాచుతో కలిసే నడిచారాయన. ఇప్పుడు తాజాగా సీఈసీ వివాదంలో కూడా బొద్దింకలతో కలిసి కదనరంగంలో జంతర్‌మంతర్‌ 2.0 కోసం రెడీ అయిపోయారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నారు. ఇక రంగంలోకి దిగడమే మిగిలుంది.

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా..

Advertisement

కాక్రోచ్‌ పార్టీ ద్వారా రాజకీయంగా యాక్టివ్‌ కావడం, ఆ తరువాత పోటీ చేయడం గెలవడం.. అలా తన పొలిటికల్‌ ఫ్యూచర్‌ కోసమే ప్రకాశ్ రాజ్ ఇదంతా చేస్తున్నారా? అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 2019లో బెంగుళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 28,900 ఓట్లు మాత్రమే సాధించి సమీప బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాభవాన్ని చవి చూశారు. ఆ తరువాత ఆయన రాజకీయాలను వదల్లేదు. అడపాదడపా అన్ని పార్టీల విషయాల్లో జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, దాని కూటమి పార్టీలను మాత్రం వదలరు. ఆడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌ ముందు కాక్రోచుల లక్ష్యమే ఉంది. కేంద్రం మెడలు వంచడం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను రాజీనామా చేసేదాకా వదలకపోవడం. దీని కోసం తన విలువైన సమయాన్ని కూడా వదులుకొని తనదైన రాజకీయం చేయడం ప్రకాశ్‌ రాజ్‌ స్టైల్. ఇప్పుడైతే అతను కాక్రోచ్‌ ప్రకాశ్‌గా పాత్ర పోషిస్తున్నారు. కాదు జీవించాలనుకుంటున్నారు.

Also read: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

Tags

Related News

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

Big Stories

Advertisement
×