E-Paper
Advertisement

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?
Advertisement

South Central Railway Special Trains for Dussehra and Diwali: ఇక పండుగల సీజన్ మొదలవుతుంది. సొంతిళ్లకు వెళ్లేవారికి.. అప్పటికప్పుడు రైలు టికెట్లు బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. రెగ్యులర్ రైళ్లలో బెర్తులు దొరకడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో రైల్వే.. ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. దసరా, దీపావళి పండుగల సీజన్‌లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా, ఇప్పటికే నడుస్తున్న కొన్ని సర్వీసులను మరింత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల పూర్తి వివరాలు ఇవే.

⦿ సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ స్పెషల్: ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు సికింద్రాబాద్, కాకినాడ నగరాల మధ్య పండుగ రద్దీ తీర్చేందుకు ప్రత్యేక సర్వీసును కేటాయించారు.
⦿ చర్లపల్లి – దానాపూర్ (ట్రైన్ నంబర్ 07049/07050): అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు వారానికో రోజు (ఆదివారం) అందుబాటులో ఉంటుంది.
⦿ చర్లపల్లి – ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు (ట్రైన్ నంబర్ 07065/07066): అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
⦿ బెంగళూరు క్యాంట్ – బీదర్ (ట్రైన్ నంబర్ 06589): అక్టోబర్ 9, 16వ తేదీల్లో ప్రత్యేకంగా నడుస్తుంది.
⦿ యశ్వంత్‌పూర్ – సహర్సా (ట్రైన్ నంబర్ 06581/06582): అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటుంది.
⦿ విశాఖపట్నం – బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ – తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్ సర్వీసులను కూడా పండుగ సీజన్ ముగిసే వరకు పొడిగించారు.

ఐటీ ఉద్యోగులకు ఊరట.. హైటెక్ సిటీలో తాత్కాలిక హాల్ట్

Advertisement

హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు, అలాగే సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లపై రద్దీ తగ్గించేందుకు రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా నడిచే 10 రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్‌లో తాత్కాలికంగా ఆగే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీలతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. పండుగల వేళ టికెట్ల రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులు ముందుగానే ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా రిజర్వేషన్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

హైటెక్ సిటీ స్టేషన్‌లో తాత్కాలికంగా ఆగే రైళ్లు, వాటి సమయాలివే:

⦿ సికింద్రాబాద్ – రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (22718): మధ్యాహ్నం 3:30 గంటలకు హైటెక్ సిటీకి చేరుకుంటుంది.
⦿ రాజ్‌కోట్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (22717): ఉదయం 6:19 గంటలకు చేరుకుంటుంది.
⦿ సికింద్రాబాద్ – పోరుబందర్ ఎక్స్‌ప్రెస్ (20967): మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకుంటుంది.
⦿ పోరుబందర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (20968): ఉదయం 6:19 గంటలకు చేరుకుంటుంది.
⦿ తిరుపతి – సికింద్రాబాద్ (12731): ఉదయం 6:08 గంటలకు చేరుకుంటుంది.
⦿ సికింద్రాబాద్ – తిరుపతి (12732): తెల్లవారుజామున 4:35 గంటలకు చేరుకుంటుంది.
⦿ హైదరాబాద్ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12702): రాత్రి 1:17 గంటలకు చేరుకుంటుంది.
⦿ బెంగళూరు – హైదరాబాద్ (12701): ఉదయం 11:07 గంటలకు చేరుకుంటుంది.
⦿ పుణె – హైదరాబాద్ (12025): మధ్యాహ్నం 1:33 గంటలకు చేరుకుంటుంది.
⦿ హైదరాబాద్ – పుణె (12026): మధ్యాహ్నం 3:00 గంటలకు చేరుకుంటుంది.

Advertisement

Also Read: దసరా, దీపావళికి రైల్వే గుడ్‌న్యూస్.. 102 స్పెషల్ రైళ్లు!

Tags

Related News

బస్ డిపోకు వెళ్లాల్సిన పనిలేదు.. మీ కాలనీ నుంచే దసరా స్పెషల్ బస్సులు!

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×