E-Paper
Advertisement

అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఈ ఘటనే ఎగ్జాంపుల్-సీపీ సజ్జనార్

అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఈ ఘటనే ఎగ్జాంపుల్-సీపీ సజ్జనార్
Advertisement

Hyderabad City: హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఘటనల గురించి ఎప్పుటికప్పుడు వివరిస్తూ నగర ప్రజలను అలర్ట్ చేస్తున్నారు సీపీ సజ్జనార్. అర్ధరాత్రి బర్త్ డేల పేరిట రోడ్లపైకి వచ్చి సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ చేయవద్దన్నారు. ఒక్కోసారి అనుకోని ఘటనలు ప్రాణాల మీదకు వస్తాయని హెచ్చరించారు. అందుకు సంబంధించి రెండురోజుల కిందట జరిగిన ఘటనను గుర్తు చేశారు.

నగర ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి

రెండు రోజుల కిందట అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు బయటకు పేరెంట్స్ తీసుకొచ్చారు. అనుకోకుండా జరిగిన ఘటనలో పాపతోపాటు కుటుంబసభ్యుడు దుర్మరణం పాలుకావడంతో ఎంతో కలిచి వేసిందన్నారు. ప్రమాదం గురించి తెలియగానే మా సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వారి కాపాడేందుకు శత విధాలా ప్రయత్నించారని, చివరకు ప్రాణాలు నిలపలేకపోయామని చెప్పారు.

అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

Advertisement

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్‌పై ప్రమాద స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. జరుగుతున్న ప్రమాదాలపై వివిధ ప్రభుత్వ విభాగాలలో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించినట్టు వివరించారు.

పుట్టినరోజు అనేది కుటుంబానికి చెందిన వ్యక్తిగత వేడుక అన్నారు. దాన్ని ఇళ్ల వద్ద లేకుంటే సురక్షితమైన ప్రదేశాల్లో జరుపుకోవాలని తెలియజేశారు. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తాయని, అలాంటి సమయంలో చిన్న పిల్లలను తీసుకుని రోడ్డుపైకి రావడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచుకోవాలని వివరించారు సీపీ.

Advertisement

ALSO READ: సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!

ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. మా పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అక్కడికి వచ్చేవారిని పంపిస్తున్నప్పటికీ మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడంవల్లే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. చిన్న పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని, అర్ధరాత్రి వేళ ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి ఈ విధంగా సంబరాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు సీపీ సజ్జనార్.

 

Related News

సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!

‘మోదీ గారూ కళ్ళు తెరవండి’.. ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

మద్యానికి బానిసై.. భూమి కోసం కన్నతండ్రిని బండరాయితో బాది చంపిన కొడుకు!

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

Big Stories

Advertisement
×