Epic First Semester OTT Release : విదేశాల్లో చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడే మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేందుకు విదేశాలకు వెళ్లిన ఓ కుర్రాడి జీవితంలో ప్రేమ అనే మాయలో పడితే, అప్పటివరకు అనుకున్నదంతా మారిపోతుంది. చదువు, కెరీర్, కుటుంబం ఒకవైపు… ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛ మరోవైపు ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘Epic – First Semester’ కథ కూడా ఇలాంటి భావోద్వేగాల చుట్టూనే తిరుగుతుంది. ‘బేబీ’ తర్వాత ఈ జంట కలిసి నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందనే ఆసక్తి నెలకొంది.
వనపర్తికి చెందిన ఆదిత్య మన హీరో. సినిమా దర్శకుడు అవ్వాలని కలలు కంటాడు. కానీ అతడి తండ్రి చంద్రశేఖర్ మాత్రం స్తోమతకు మించిన లోన్ ఇప్పించి మరీ ఆదిత్యను పైచదువుల కోసం లండన్ పంపిస్తాడు. అక్కడ అడుగు పెట్టిన మొదటి రోజే ఆదిత్య జీవితంలోకి కడలి వస్తుంది. తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం, ఇతరులు ఏమనుకుంటారో అని ఎక్కువగా ఆలోచించకపోవడం కడలి ప్రత్యేకత. రోహన్ మాత్రం కొన్ని విషయాల్లో సంకోచిస్తూ, తన చుట్టూ ఉన్నవారి అంచనాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని చూస్తుంటాడు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడే పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది.
మొదట్లో వాళ్ల మధ్య ఉండే ఆకర్షణ, సరదా సంభాషణలు, చిన్న చిన్న గొడవలు ప్రేమలోని అందమైన క్షణాల్లా అనిపిస్తాయి. కానీ ఒకరినొకరు మరింత దగ్గరగా తెలుసుకునే కొద్దీ గొడవలు మొదలవుతాయి. ఆదిత్య జీవితంలో నిలదొక్కుకోవాలని చూస్తాడు. కడలి కూడా తన స్వేచ్చను వదులుకోకుండా ఈ బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ఆలోచిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడినా, అభిప్రాయ భేదాలు కూడా పెరుగుతాయి.
కథలో విదేశీ యూనివర్సిటీ జీవితం, యువత ప్రేమలో ఎదుర్కొనే భావోద్వేగాలు, కుటుంబాల అంచనాలు ప్రధానంగా కనిపిస్తాయి. మరి చివరికి ఆదిత్య, కడలి బంధం ఎటు వెళ్తుంది ? ప్రేమ కోసం వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ? 9 నెలల కోర్సు కోసం లండన్ లో అడుగు పెట్టిన ఆదిత్య లైఫ్ లాస్ట్ లో ఎలాంటి టర్న్ తీసుకుంది ? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
Also Read : కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’కి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ రోహన్ పాత్రలో, వైష్ణవి చైతన్య కడలి పాత్రలో నటించారు. శివాజీ, వాసుకి ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే అక్టోబర్ 9న Netflixలో స్ట్రీమింగ్ కి వచ్చింది ఈ సినిమా. ఓటీటీలో తెలుగుతో పాటు 5 భాషల్లో అందుబాటులో ఉంది