E-Paper
Advertisement

విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్! రేవంత్ విసిరిన ఉద్య‌మ‌కారుల అస్త్రాన్ని తిప్పి కొట్టిన బీఆరెఎస్‌!

విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్! రేవంత్ విసిరిన ఉద్య‌మ‌కారుల అస్త్రాన్ని తిప్పి కొట్టిన బీఆరెఎస్‌!
Advertisement

రేవంత్ విసిరిన అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కోదండ‌రామ్ పేరును వాడుకుంటోంది బీఆరెస్‌. కేసీఆర్ వ‌ద్ద తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న నేత‌లెవ‌రూ లేర‌ని, వారిని ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని రేవంత్ అన్నారు. దీనిపై హ‌రీశ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. తెలంగాణ ఉద్య‌మంలో రేవంతే వ్య‌తిరేకంగా ప‌నిచేశార‌ని చరిత్ర త‌వ్వడంతో పాటు ఉద్య‌మ‌కారుల‌కు బీఆరెస్ ఇచ్చిన ప్ర‌యార్టీ, ప‌ద‌వుల గురించి ఏక‌రువు పెట్టారు.

రేవంత్ వ‌ద్ద ఒక్క కోదండ‌రామ్ ఉన్నార‌ని, ఆయ‌న కూడా ప్ర‌భుత్వం పై ఏమీ మాట్లాడ‌టం లేద‌ని విమ‌ర్శించ‌డంతో పాటు.. ఆయ‌న‌కు విద్యాశాఖ మంత్రిని చేయొచ్చు క‌దా అని ఓ ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చాడు హ‌రీశ్‌.  తెలంగాణ ఉద్య‌మంలో ప‌నిచేసిన .. దేశ్‌ప‌తి శ్రీ‌నివాస్‌, ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌, స్వామిగౌడ్‌, దేవీ ప్ర‌సాద్ రావు, శ్రీ‌నివాస్ గౌడ్‌, బాల్క సుమ‌న్‌, లింబాద్రి, గోర‌టి వెంక‌న్న‌.. వీరంతా ఉద్య‌మ‌కారులే క‌దా.. అని వివ‌రించారు. వీరికి వివిధ ప‌ద‌వులు ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేస్తూనే కోదండ‌రామ్‌ను విద్యాశాఖ మంత్రిని చేయాల‌నే వాద‌న‌ను కూడా తెర‌పైకి తెచ్చారు.

Advertisement

తెలంగాణ ఉద్య‌మ‌కారుల గురించి ప్ర‌స్తావ‌న తెచ్చి.. వారంతా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌నే విష‌యాన్ని రేవంత్ చెప్పాల‌నుకున్నారు. త్వ‌ర‌లో కేకే క‌మిటీ నేతృత్వ్యంలో ఉద్య‌మ‌కారుల‌ను గుర్తించి వారికి ప్ర‌భుత్వ జాగా, పింఛ‌న్ ఇవ్వాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు. కేసీఆర్ పాల‌న‌లో ఇది జ‌ర‌గ‌లేదు. అమ‌రుల కుటుంబాల‌కు కొంత మందికి మాత్రం ప్ర‌భుత్వ ఉద్యోగాలిచ్చారు.

కాంగ్రెస్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్య‌మ‌కారుల ఇష్యూను సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. కేసీఆర్ పాల‌న మీద ఏ ఏ వ‌ర్గాలు వ్య‌తిరేకంగా ఉన్నాయో అంద‌రినీ చేర‌దీసి వారికి అభ‌యం ఇచ్చే విధంగా త‌మ మ్యానిఫెస్టోలో హామీల‌ను పొందుప‌రిచింది. ఇందులో ఉద్య‌మ‌కారులు కూడా ఉన్నారు. కోదండ‌రామ్ లాంటి వారిని ప‌ట్టించుకోలేద‌ని, ఆయ‌న ఇంటిని బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ ప‌ట్టుకెళ్లార‌నే విష‌యాన్ని సీఎం గుర్తు చేస్తూనే.. కేసీఆర్‌కు త‌న ఆలోచ‌న‌లే త‌ప్ప‌.. ఉద్య‌మ‌కారుల ఆలోచ‌న‌లు న‌చ్చ‌వ‌ని, ఎవ‌రైనా చెప్పాల‌ని చూస్తే ఇలాగే ఇండ్ల తలుపులు బ‌ద్ద‌లు కొడ‌తార‌ని విమ‌ర్శించారు.

Advertisement

దీన్ని తిప్పికొట్టేందుకు హ‌రీశ్‌.. కోదండ‌రామ్‌ను విమ‌ర్శిస్తూనే ..సీఎం విసిరిన అస్త్రాన్ని తిరిగి ఆయ‌న మీదకే ప్ర‌యోగించేలా.. విద్యాశాఖ మంత్రి ప‌దవి త‌న‌కు ఇవ్వాల‌నే ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డం మూలంగా స‌ర్కార్‌ను సెల్ఫ్‌గోల్ చేయొచ్చ‌ని బీఆరెస్ భావిస్తోంది. దీనిపై ఆ పార్టీలో చ‌ర్చ జ‌రిగిన‌ట్టుంది. ఉద్య‌మ‌కారుల ఇష్యూ కూడా తీవ్రంగానే ఉంది. ఇంకా కేసీఆర్‌ను న‌మ్మేలా లేరు వారు. తాజాగా సీఎం వ్యాఖ్య‌లు కూడా వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టిన‌ట్టే ఉండ‌టంతో దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాల‌ని ఈ విధంగా కోదండ‌రామ్‌కు మంత్రి ప‌ద‌వి అనే బాల్‌ను రేవంత్ కోర్టులో విసిరేసింది బీఆరెస్‌.

 

Related News

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

Big Stories

Advertisement
×