Drunk Driving: స్వేచ్చ బ్యూరో: మద్యం మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ రాపిడో రైడర్ మృతికి కారణమైన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శనివారం గండిమైసమ్మ సమీపంలోని గ్లాండ్ ఫార్మా కంపెనీ వద్ద చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనూ యాదవ్ అనే వ్యక్తి బొలెరో వాహనం (TS07 UL 0003)ను మద్యం సేవించిన స్థితిలో అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న రాపిడో స్కూటీ (TG08 BD 7343)ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న గున్నెట్టి మోహన్రావు (32) తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సోనూ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల సమక్షంలో నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో నిందితుడు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సోనూ యాదవ్‌ను అరెస్టు చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు దుండిగల్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Also Read: మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!