E-Paper
Advertisement

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?
Advertisement

YouTube Data Usage: స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. మనమంతా రోజూ గంటల తరబడి యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూనే ఉంటాం. అయితే చాలామందికి తెలియకుండానే మొబైల్ డేటా త్వరగా అయిపోతుంటుంది. అసలు యూట్యూబ్‌లో ఏ క్వాలిటీలో వీడియో చూస్తే ఎంత డేటా ఖర్చవుతుంది? డేటాను ఎలా పొదుపు చేసుకోవాలో ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం.

తక్కువ క్వాలిటీ – 144p & 240p:

మీ ఫోన్‌లో డేటా చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదా కేవలం ఆడియో మాత్రమే వినాలనుకున్నప్పుడు 144p లేదా 240p క్వాలిటీ బాగా ఉపయోగపడుతుంది. 144p క్వాలిటీలో వీడియో చూస్తే గంటకు సుమారు 30 నుండి 90 ఎంబీ డేటా మాత్రమే ఖర్చవుతుంది. అలాగే 240p క్వాలిటీలో చూస్తే గంటకు 180 నుండి 250 ఎంబీ వరకు డేటా పడుతుంది. ఇవి రెండు కూడా డేటా పొదుపు చేయడానికి చాలా మంచి ఆప్షన్లు.

సాధారణ క్వాలిటీ – 360p & 480p:

Advertisement

మొబైల్ స్క్రీన్‌పై వీడియో స్పష్టంగా కనిపిస్తూ.. డేటా కూడా ఎక్కువ ఖర్చు కాకూడదు అనుకుంటే 360p, 480p క్వాలిటీ సరైనవి. 360p సెట్టింగ్‌లో గంటకు 300 నుండి 450 ఎంబీ డేటా ఖర్చవుతుంది. కొంచెం స్పష్టత పెంచి 480pలో చూస్తే గంటకు 480 నుండి 660 ఎంబీ వరకు డేటా అవసరమవుతుంది. రోజువారీ వాడకానికి ఈ క్వాలిటీలు బాగా సరిపోతాయి.

Also Read: ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

హై డెఫినిషన్ – 720p HD:

Advertisement

వీడియో చాలా క్లియర్‌గా చూడాలనుకున్నప్పుడు మనం 720p హెచ్‌డీ ఆప్షన్ ఎంచుకుంటాం. అయితే క్వాలిటీ పెరిగే కొద్దీ డేటా వాడకం కూడా గణనీయంగా పెరుగుతుంది. 720pలో ఒక గంట వీడియో చూస్తే దాదాపు 0.7 జీబీ నుండి 1.5 జీబీ వరకు డేటా ఖర్చవుతుంది. మన రోజువారీ డేటా పరిమితి త్వరగా అయిపోవడానికి ఇది ప్రధాన కారణం.

ఫుల్ హెచ్‌డీ – 1080p:

పెద్ద స్క్రీన్లపై లేదా పూర్తి స్పష్టతతో వీడియో అనుభూతిని పొందడానికి 1080p ఫుల్ హెచ్‌డీ వాడతారు. ఈ క్వాలిటీలో ఒక గంట వీడియో చూస్తే ఏకంగా 1.5 జీబీ నుండి 3 జీబీ వరకు డేటా ఖర్చవుతుంది. ముఖ్యంగా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉన్న వీడియోలు చూసినప్పుడు డేటా ఇంకా వేగంగా కరిగిపోతుంది.

అల్ట్రా హెచ్‌డీ – 1440p & 4K:

ఇక అత్యంత స్పష్టమైన 1440p లేదా 4K క్వాలిటీలో వీడియోలు చూస్తే డేటా రాకెట్ వేగంతో అయిపోతుంది. ఈ క్వాలిటీలో గంటకు 2.5 జీబీ నుండి 10 జీబీ కంటే ఎక్కువ డేటా ఖర్చవుతుంది. కాబట్టి.. వైఫై ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వాలిటీ వాడటం మంచిది. యూట్యూబ్ నిర్దిష్టంగా ఒకే రకమైన డేటా పరిమితిని ప్రకటించకపోయినా.. మనం ఎంచుకునే వీడియో రకం, ఫ్రేమ్ రేట్ ఆధారంగా ఈ వ్యత్యాసాలు ఉంటాయి.

Also Read: ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

Tags

Related News

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×