BigTV English

Hyderabad food safety officers raids : కంట్రోల్ లేని కల్తీ ఫుడ్.. కేఎఫ్ఎసీ, కృతుంగ, షాగౌస్ లోనూ కుళ్లిన ఆహారం

Hyderabad food safety officers raids : కంట్రోల్ లేని కల్తీ ఫుడ్.. కేఎఫ్ఎసీ, కృతుంగ, షాగౌస్ లోనూ కుళ్లిన ఆహారం

Hyderabad food safety officers raids: బ‌య‌ట ఫుడ్ లొట్ట‌లేసుకుంటూ తింటున్నారా? పేరు మోసిన రెస్టారెంట్స్ నుండి చిన్న సైజు కిచన్స్ వ‌ర‌కు నాణ్య‌త లేని ప‌దార్థాలు దర్శన మిస్తున్నాయి. హైదారాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో సంచ‌ల‌న నిజాలు వెలుగులోకి వచ్చాయి. భాగ్యనగరంలో కల్తీ ఫుడ్ అడ్డు అదుపు లేకుండా పోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, కేఎఫ్‌సీల్లో నిబంధనలు తుంగలో తొక్కారు. రుచుల కోసం వినియోగదారులు ఎగబడే ముందు ఆలోచించండి. లేదంటే లేనిపోని రోగాలు వెంటాడడం ఖాయం.


తాజాగా మంగళవారం సోమాజిగూడ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో హోటళ్లపై ఫుట్ సేఫ్టీ అధికారులు కొరడా ఝులిపించారు. తనిఖీల్లో హోటళ్ల డొల్లతనం బయటపడింది. సోమాజిగూడలోని కృతుంగ రెస్టారెంట్, ఓ బార్, కేఎఫ్‌సీల్లో నిబంధనలను వైలెట్ చేశాయి. లైసెన్సు లేని సంస్థల పేరుతో తయారైన ఆహారం, టీడీఎస్ తగిన మోతాడులో లేని మంచి నీటి బాటిళ్లు, దుర్గంధంతో కూడిన కిచెన్లను పరిశీలించి షాకయ్యారు అధికారులు.

చివరకు భోజనం వడ్డించే గిన్నెలను సరిగా శుభ్రం చేయని హోటళ్లు, రెస్టారెంట్లు దర్శన మిచ్చాయి.
పన్నీర్ ప్యాకెట్లు, మసాలాలు, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన వేర్వేరు మాంసం, ప్యాకింగ్ సరిగా లేని పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్, న్యూడిల్స్ ఇంకా ఫుడ్‌కి ఉపయోగించే మెటీరియల్ అన్నీఇన్నీకావు. వాటిని నమూనాలు తీసుకుని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.


Hyderabad food safety officers raid on hotels and restaurants various places
Hyderabad food safety officers raid on hotels and restaurants various places

ఇదే కాకుండా నగరంలోని చాలా హోటళ్లలో నాణ్యత లేని ఆహారాన్ని అమ్ముతున్నట్లు తేలింది. ఇటీవల మకావు కిచెన్ అండ్ బార్‌‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్‌పై ఫంగస్, బొద్దింకలు ఉన్నట్లు గమనించారు. దాదాపు నాలుగు వేల విలువైన చికెన్, సాస్, ఫంగస్ సోకిన జీడిపప్పును స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ: పీఓకేపై.. ఎన్నికల వేళ ఎందుకీ వ్యాఖ్యలు ? : ఒవైసీ

ఇక్కడేకాదు చాలా చోట్ల హోటళ్లు ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించారు అధికారులు. గత నెల 16 నుంచి ఇప్పటివరకు దాడాపు 90 చోట్ల అధికారులు తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 40 హోటళ్లపై కేసులు నమోదు చేశారు.

Tags

Related News

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Jadcherla bakery: కర్రీ పఫ్ తింటుంటే నోటికి మెత్తగా తగిలింది.. ఏంటా అని చూస్తే పాము!

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Big Stories

×