Free Chicken In Hyderabad: బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బకు చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్ తినేందుకు ప్రజలు ఎవరూ సాహసించని పరిస్థితి. ఓ వైపు వైరస్ ప్రభావం లేని జిల్లాలలో చికెన్ తినండి అంటూ అధికారులు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం.. అమ్మో వైరస్ అనేస్తున్నారు. కానీ ఇంతలా ప్రజలు భయపడుతున్నా.. ఇక్కడ మాత్రం ప్రజలు క్యూ కట్టారు. అది కూడా అలా ఇలా కాదు. చిన్నా పెద్దా తేడా లేకుండా చేతిలో బుట్టలు పట్టుకొని పెద్ద క్యూనే ఉంది. ఇదేమి చికెన్.. మరీ అంత స్పెషలా అనుకోవద్దు సుమా.. అసలు విషయం తెలిస్తే ఔరా అనాల్సిందే.
రెండు తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బకు ఎన్నో కోళ్లు మరణించాయి. పౌల్ట్రీ యజమానులకు ఆర్థిక నష్టం వాటిల్లింది. పాడు వైరస్ ఏమో కానీ, కోళ్ల పరిశ్రమను పెద్ద దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఏపీలో చనిపోయిన కోళ్లను అధికారులు ఖననం కూడా చేశారు. ప్రధానంగా ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం కనిపించగా, అక్కడి అధికారులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో చికెన్ కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. చికెన్ ధర తగ్గినా ప్రజలు ఏమాత్రం చికెన్ దుకాణాల వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. అలాగే కోడి గ్రుడ్ల అమ్మకాలు కూడా అంతంత మాత్రమే సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో పౌల్ట్రీ యజమానులకు వినూత్న ఆలోచన తట్టింది. అదేమిటో తెలుసుకుందాం..
ఏపీలోని గుంటూరులో పౌల్ట్రీ యజమానులు చర్చించుకొని ప్రజలను పరీక్ష పెట్టాలనుకున్నారో ఏమో గానీ, ఏకంగా ఫ్రీ ఫ్రీ అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఇంకేముంది బర్డ్ ఫ్లూ వైరస్ భయం సైడ్ అయింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. భారీ క్యూ ఏర్పడింది. అదే తరహాలో తెలంగాణలో కూడా పౌల్ట్రీ యజమానులు అదే రీతిలో ఆలోచించారు. హైదరాబాద్ ఉప్పల్ లోని గణేష్ నగర్ వద్ద ఉచితంగా మెగా చికెన్ అండ్ ఎగ్ మేళాను శుక్రవారం పౌల్ట్రీ యజమానులు ప్రారంభించారు. ఫ్రీ చికెన్ అంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టడం విశేషం. సుమారు అర కిలో మీటర్ మేర క్యూ ఏర్పడిందంటే, ఫ్రీ చికెన్ ఎఫెక్ట్ ఎలా ఉందో చెప్పవచ్చు.
అయితే ఏపీ, తెలంగాణలో వ్యాపారులు ఉచితంగా చికెన్ పంపిణీ చేయడం వెనుక ఆంతర్యం ఇదేనని ప్రచారం సాగుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం లేని జిల్లాలలో ప్రజలు చికెన్, గ్రుడ్లు తినవచ్చని అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నా, ఏమాత్రం ప్రభావం చూపని పరిస్థితి. కొనుగోళ్లు లేక ఇటు పౌల్ట్రీ యజమానులు, అటు వ్యాపారస్థులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
Also Read: వైఎస్సార్ చెప్పులు మోసి.. జగన్ కు హారతులు.. కేసీఆర్ గుర్తుందా?
అందుకే ఉచితంగా చికెన్, గుడ్లను పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న భయాన్ని పారద్రోలి, మళ్లీ చికెన్ వైపు ప్రజలను మళ్లించేందుకు ఫ్రీ ఆలోచన చేసినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనా బర్డ్ ఫ్లూ వైరస్ ధాటికి పౌల్ట్రీ రంగం పూర్తిగా నష్టపోగా, మళ్లీ పుంజుకునే ప్రయత్నాలలో భాగంగానే అసోసియేషన్ ఉచితంగా చికెన్ పంపిణీ చేస్తుందని భావించవచ్చు.
ఫ్రీ చికెన్.. క్యూ కట్టిన జనం..
హైదరాబాద్ ఉప్పల్ లోని గణేష్ నగర్ వద్ద ఉచితంగా మెగా చికెన్ అండ్ ఎగ్ మేళా
ఫ్రీ చికెన్ ఫ్రై కోసం దాదాపుగా అర కిలోమీటర్ మేర క్యూ కట్టిన నాన్ వేజ్ ప్రియులు
బర్డ్ ఫ్లూ భయమే లేకుండా చికెన్ ఫ్రై కోసం ఎగబడ్డ జనం pic.twitter.com/H2WDY5HeUU
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025