Shreyanka Patil – Mayank Yadav: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Women’s Premier League 2025 Tournament ) బ్రహ్మాండంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో ఆరు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ ఏడవ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ( Chinnaswamy Stadium ) జరుగుతుంది. ఇవాళ… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ( Royal Challengers Bengaluru Women ) వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ( Mumbai Indians Women ) మధ్య కీలక పోరు జరుగుతుంది. ఇప్పటికే వరుసగా విజయాలు నమోదు చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ఈ మ్యాచ్ కూడా గెలవాలని దూసుకు వెళ్తోంది.
Also Read: Rashid Khan Run-out: దరిద్రం అంటే ఇదే.. బ్యాట్ పెట్టిన ఔట్ అయ్యాడే ?
అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ చూసేందుకు.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ( Mayank Yadav )… బెంగళూరు స్టేడియానికి వచ్చాడు. అయితే అతడు సింగిల్ గా వస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. మహిళ క్రికెటర్, ఆర్ సి బి ప్లేయర్ శ్రేయాంక పాటిల్ తో ( Shreyanka Patil ) కలిసి… బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో మెరిశాడు మయాంక్ యాదవ్. ఇద్దరు పక్క పక్కనే కూర్చొని…. లవర్స్ లాగా ఫీల్ అవుతూ… మ్యాచ్ తిలకిస్తున్నారు. అయితే మయాంక్ యాదవ్, శ్రేయాంక పాటిల్ ఇద్దరితో పాటు… ఆశా శోభన కూడా అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రియాంక పాటిల్ అలాగే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున.. శ్రేయాంక పాటిల్ ఆడాల్సి ఉండేది. కానీ టోర్నమెంట్ ప్రారంభంలోనే ఆమెకు గాయం అయింది. దీంతో శ్రేయాంక పాటిల్ స్థానంలో ఆర్సిబి లోకి స్నేహ రానా రావడం జరిగింది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు దూరం కావడంతో… మ్యాచ్ తిలకించేందుకు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో మెరిసింది శ్రేయాంక పాటిల్. అయితే సింగిల్ గా ఆమె రాకుండా… టీమిండియా యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ తో రావడం… చర్చనీయాంశమైంది.
ఇద్దరూ యంగ్ క్రికెటర్లు… బెంగళూరు స్టేడియంలో కనిపించడంతో… వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయనం నడుస్తోందని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా… పోస్టులు పెడుతున్నారు. కాగా… 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే మయాంక్ యాదవ్… గాయం కారణంగా టీమిండియా కు దూరమైన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్ తరఫున ఆడుతున్న మయాంక్ యాదవ్.. మంచి ఆటతీరుతో టీమిండియాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాత అతనికి గాయం కావడంతో… జట్టుకు దూరమయ్యాడు.
Also Read: Pakistan – Champions Trophy: టీమిండియా దెబ్బ అదుర్స్.. ఇక ఇంటికే పాక్.. లెక్కలు ఇవే !
— Out Of Context Cricket (@GemsOfCricket) February 21, 2025