Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రికి ఇంటికి ఆయన మృతదేహాన్ని తరలించనున్నారు. ఎమ్మెల్యే గోపినాథ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. జూన్ 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.
కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు గుర్తించిన వైద్యులు, వెంటనే ట్రీట్‌మెంట్ కొనసాగించారు. సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆయన సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో చికిత్స కొనసాగించారు. అయితే కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల కిందట ఏఐజీలో చేరారు. ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నారు కూడా.
జూబ్లీహిల్స్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు మాగంటి గోపీనాథ్. టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఆయన, 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆ తర్వాత తెలంగాణలో మారిన రాజకీయాల నేపథ్యంలో కారు గూటికి చేరుకున్నారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి అదే నియోజకవర్గం గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
ALSO READ: కేబినెట్‌లో కొత్త మంత్రులు వీళ్లే
జూన్ 5న అనారోగ్యంలో ఆసుపత్రిలో చేరారు మాగంటి గోపినాథ్. ఆయన ఆరోగ్యం గురించి తెలియగానే బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆదివారం ఏఐజీకి కేసీఆర్ వెళ్లాలని భావించారు. ఈలోగా మాగంటి మరణవార్త తెలియగానే షాక్ అయ్యారు.
గోపినాథ్ మరణవార్త తనను కలిచివేసిందన్నారు సీఎం చంద్రబాబు. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశంతో మొదలైందన్నారు. తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏఐజీకి కేసీఆర్ వచ్చారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతం ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి డెడ్ బాడీని తరలించనున్నారు. అయితే రోజు, లేకుంటే సోమవారం మాగంటి గోపినాథ్‌కు అంత్యక్రియలు జరగనున్నాయి.
మరోవైపు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మరణవార్త తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల తలలో నాలుకగా మారారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.