BigTV English
Advertisement

Posani Krishna – RGV : పోసానిని జైలుకు వదిలేదిన వైసీపీ – వై రాజా.? వాట్ హ్యాపెండ్.?

Posani Krishna – RGV : పోసానిని జైలుకు వదిలేదిన వైసీపీ – వై రాజా.? వాట్ హ్యాపెండ్.?

Posani Krishna – RGV :  పోసాని కృష్ణమురళీ జైళ్లు పట్టుకు తిరుగుతున్నారు. ఒకచోట కస్టడీ అయిపోగానే మరోచోటకు వెళుతూ రాష్ట్రంలోని అన్ని జైళ్లను చుట్టేస్తున్నారు. సినిమా రంగంలో అత్యంత గౌరవ, మర్యాదలు అందుకున్న వ్యక్తికి ఇలా జరగాలని ఎవరూ కోరుకోరు.. కానీ ఆయన ప్రవర్తన, మాటలే ఆయన ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితానికి కారణం అని అంతా అంటున్నారు. అయితే.. ఇదే పోసాని ఎవరి కోసం అయితే నోటికి వచ్చినట్లు మాట్లాడారో.. అదే నాయకుడు కనీసం పోసాని గురించి మాట్లాడడం లేదు. ఆయన్ను పలకరించేందుకు సైతం ప్రయత్నించలేదు. ఏ వైసీపీ కోసం అయితే కష్టపడ్డారో, ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారో.. అదే వైసీపీ పోసాని గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. మొదట్లో.. వైసీపీలోని కొంత మంది నేతలు.. ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రయత్నాలు చేసారు. కానీ..ఇప్పుడు మాత్రం ఎవరూ స్పందించడం లేదు.


ప్రస్తుత కూటమి పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికీ మాటలు హద్దులు దాటాయి. వాళ్ల స్థాయిని, స్థానాన్ని మరిచిపోయి… పార్టీల రొచ్చులో దొర్లారు. అలాంటి వారిలో పోసానికి కూడా పెద్ద గజమాలే వేయాలి అంటున్నారు కూటమి మద్ధతుదారులు. పోసాని కంటే ముందు మరింత పెద్ద సత్కారం చేయాల్సి వస్తే.. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి చేయాల్సి ఉంటుంది. అతని నోటికి అయితే పచ్చి బూతులే వస్తుంటాయి. ఆయా వీడియోలు ఇప్పటికీ.. సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉన్నాయి. కాగా.. అతని పరిస్థితీ పోసాని లాగానే రాష్ట్రంలోని జైళ్లకు రిమాండ్ మీద సందర్శించుకుని వస్తున్నాడు. వీరిద్దరి విషయంలో వైసీపీ డైరెక్టుగా సపోర్టు చేయకపోవడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి వైసీపీ అధినేతకు ఓదార్పులు బాగా కలిసి వస్తాయంటున్నారు కూటమి నేతలు.. ఆయన తొలినాళ్ల నుంచి ఓదార్పులతోనే పార్టీని నెట్టుకు వస్తున్నారు. అలా.. టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో అరెస్టు అయిన వల్లభనేని వంశీ, ఎలక్షన్ సమయంలో ఈవీఎం మెషిన్ పగులగొట్టిన కేసులో పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డితో సహా వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన నందిగం సురేష్ వంటి వారిని జగన్ స్వయంగా పలకరించారు. మిగతా వారికి వైసీపీ కేడర్, జిల్లా స్థాయి పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారు. కానీ.. పోసాని, బోరుగడ్డకు మాత్రం ఎవరూ మద్ధతు నిలవడం లేదు. అంటే.. ఎవరైనా దిగజారుడు మాటలు మాట్లాడితే.. వారిని అవసరాలకు వాడుకుంటారు కానీ, ఆపదలో ఆదుకోరు అనే విషయం వీరిని చూసైనా తెలుసుకోవాలంటున్నారు.


అందుకే పోసానిని దూరం పెట్టేశారా.

పోసాని కృష్ణమురళి సినిమా పరిశ్రమలో గుర్తింపు స్థాయి రచయిత, నటుడిగానే ఉన్నారు. ఆయనను పట్టించుకోని వైసీపీ నాయకులు.. వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో మాత్రం హడావిడి చేశారు. ఒంగోలు పోలీసు స్టేషన్ లో విచారణకు హజరైన ఆర్జీవీ కి స్వాగతం పలికే దగ్గర నుంచి తిరిగి ఆయన్ను విచారణ అనంతరం విడిచిపెట్టే వరకు దగ్గరుండి వైసీపీ నాయకులు చూసుకున్నారు. అంత మాత్రం గౌరవం కూడా పోసానికి దక్కలేదు.

Also Read : AP Politics: కూటమిపై కుట్ర.. అంత ఈజీనా..?

అయితే.. స్టార్టింగ్ లో గట్టిగానే నిలబడిన పోసాని.. ఆ తర్వాత మాత్రం తన మాటల వెనుక అసలు కారణాల్ని వెల్లడించారు. తొలుత వైసీపీ సకల శాఖ మంత్రి సజ్జల రామాకృష్ణ రెడ్డి డైరెక్షన్ లోనే తాను మాటల్ని తూలానని ఒప్పుకున్నారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన ఓ పత్రికకు సంబంధించిన వ్యక్తులు అందించిన స్క్రిప్ట్ కారణంగానే మాట్లాడాను అంటూ ఉన్నది ఉన్నట్లు చెప్పేసారు. దాంతో… వైసీపీ కార్నర్ కావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దాంతో.. అతనికి సపోర్టు చేసి మరీ ఇరుకున పడడం ఎందుకులే అనుకుని.. వైసీపీ క్యాడర్ సైలెంట్ అయ్యింది అంటున్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×