E-Paper
Advertisement

70 ఏళ్ల వృద్ధుడు.. అరకు నుంచి ముంబైకి గంజాయి సప్లై.. ఎలా చిక్కాడంటే!

70 ఏళ్ల వృద్ధుడు.. అరకు నుంచి ముంబైకి గంజాయి సప్లై.. ఎలా చిక్కాడంటే!
Advertisement

Ganja Transport: స్వేచ్చ బ్యూరో: కమీషన్ల కోసం కక్కుర్తిపడి గంజాయి ట్రాన్స్​ పోర్టర్లుగా మారిన అయిదుగురిని హైదరాబాద్ సీసీఎస్​ అధికారులు గాంధీనగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10లక్షల రూపాయల విలువ చేసే 38కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదనపు సీపీ (క్రైమ్స్​) ఎం.శ్రీనివాస్​ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన రాజారామ్​ స్వామ కణ్ణు పడయాచి (78), సంతోష్​ బలరాం ప్రజాపతి (65), సిల్మినా కుజూర్ (36), శీలాదేవి (48), తమిళనాడుకు చెందిన విజయలక్ష్మి కలియమూర్తి పిళ్లై (66)ల మధ్య పరిచయంం ఉంది.

వేర్వేరు బస్సుల్లో..

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం అరకు ప్రాంతంలో గంజాయి దందా చేస్తున్న ఓ వ్యక్తి వృద్ధులు, మహిళలు కావటంతో పోలీసులకు అనుమానం రాదని ముంబయికి గంజాయిని ట్రాన్స్​ పోర్ట్​ చేయటానికి ఈ అయిదుగురిని నియమించుకున్నాడు. అయిదుగురిని అరకు పిలిపించుకుని గంజాయి ప్యాకెట్లను అప్పగించేవాడు. వాటితో నిందితులు వేర్వేరు బస్సుల్లో అందరూ మొదట హైదరాబాద్​ చేరుకుంటారు. వేర్వేరు లాడ్జీల్లో ఒకరోజు ఉండి ఆ మరుసటి రోజు ముంబై బయల్దేరుతారు.

Advertisement

Alao Raed; అనుచితంగా మ‌ట్లాడారు… పార్టీ లైన్ దాటారు.. కానీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఎప్పుడుంటాయో చెప్ప‌లేము..!

అరకు వెళ్లిన అయిదుగురు..

అక్కడికి చేరుకోగానే అసలు సూత్రధారి చెప్పిన వారికి గంజాయిని డెలివరీ చేస్తారు. ఈ పని చేసినందుకు సూత్రధారి ఒక్కొక్కరికి 10 నుంచి 12వేల రూపాయలు కమీషన్​ గా ఇస్తున్నాడు. ఎప్పటిలానే అరకు వెళ్లిన అయిదుగురు 38కిలోల ఎండు గంజాయిని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు సమాచారం అందటంతో సీసీఎస్ డీసీపీ చైతన్యకుమార్​ పర్యవేక్షణలో సీఐ ఛత్రాసి సుధాకర్​ రావు, ఎస్​ఐ గౌరేందర్​ గౌడ్​ తోపాటు గాంధీనగర్​ పోలీసులు కలిసి అయిదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయిని సీజ్​ చేశారు. నిందితులు అందరిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: అంజయ్యనగర్‌లో హైడ్రా ఆపరేషన్.. ఆ భవనాల కూల్చివేస్తాం వెంటనే ఖాళీ చేయండి: రంగనాథ్

Tags

Related News

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

పటేల్‌కు ఓట్లు పడితే నెహ్రూను ప్రధాని చేశారు.. ఓటు చోరీ కాంగ్రెస్‌దే: బండి సంజయ్

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×