E-Paper
Advertisement

శవాలను మాయం చేసే బిజినెస్… ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

శవాలను మాయం చేసే బిజినెస్… ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు
Advertisement

Dark Comedy Crime Series: ఒక మర్డర్ జరిగితే సాధారణంగా పోలీసులు రంగంలోకి దిగుతారు. కానీ ఓ మర్డర్ తర్వాత శవాన్ని మాయం చేయడాన్నే ముగ్గురు స్నేహితులు బిజినెస్‌గా మార్చుకుంటే ? మొదట ఈ పని ఈజీ మనీలా అనిపిస్తుంది. ఒక శవం… ఒక పేమెంట్. మరో శవం… ఇంకాస్త ఎక్కువ డబ్బు. కానీ ఒక్కో శవం వెనుక ఒక్కో గ్యాంగ్, ఒక్కో రహస్యం ఉంటే ? చివరకు గ్యాంగ్‌స్టర్లు, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ వీళ్ల వెంట పడితే పరిస్థితి ఏంటి ? ఇదే క్రేజీ కాన్సెప్ట్‌తో వచ్చిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘క్లీన్ అప్ కంపెనీ’ (clean up company 2026 season 1). మరి ఈ ముగ్గురు అసలు ఈ బిజినెస్‌లోకి ఎలా వచ్చారు ? వాళ్లకు ఎదురైన ప్రమాదాలు ఏంటి ? సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ పశ్చిమ బెంగాల్‌లోని క్రైమ్‌తో నిండిన బోర్డర్ టౌన్ సరిబ్‌ గంజ్లో మొదలవుతుంది. ఇక్కడ చట్టం కంటే గ్యాంగ్‌స్టర్ల మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. అదే ఊరిలో రాజు, స్వప్న్, గోల్డీ అనే ముగ్గురు స్నేహితులు బలాదూర్ గా తిరుగుతుంటారు. డబ్బు అవసరం ఉన్నా సరైన పని మాత్రం దొరకదు. ఓ రోజు ఓ లోకల్ గ్యాంగ్‌స్టర్ చేసిన మర్డర్ తర్వాత క్రైమ్ సీన్‌ను క్లీన్ చేయాల్సిన బాధ్యత వీళ్లపై పడుతుంది. పోలీసులకు ఆధారాలు దొరకకుండా స్థలాన్ని శుభ్రం చేయడంతో పాటు శవాన్ని కూడా మాయం చేయాలి.

Advertisement

పని పూర్తయిన తర్వాత చేతికి వచ్చిన డబ్బు చూసి ముగ్గురికీ కొత్త ఆలోచన వస్తుంది. ఇదే పనిని మనమే బిజినెస్‌గా చేస్తే? అలా క్లీన్ అప్ కంపెనీ మొదలవుతుంది. ఎక్కడ మర్డర్ జరిగినా, శవాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాల్సి వచ్చినా వీళ్లను సంప్రదించొచ్చు. మొదట్లో డబ్బు బాగానే వస్తుంది. కానీ శవాలు పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఒక్కో మర్డర్ వెనుక ఒక్కో గ్యాంగ్, ఒక్కో రహస్యం ఉంటుంది. ఒక గ్యాంగ్‌కు చేసిన పని మరో గ్యాంగ్‌కు శత్రుత్వంగా మారుతుంది.

తెలియకుండానే ఈ ముగ్గురు గ్యాంగ్ వార్స్ మధ్యలో చిక్కుకుంటారు. మరోవైపు వరుసగా జరుగుతున్న మర్డర్ల వెనుక ఏదో లింక్ ఉందని పోలీసులు గుర్తిస్తారు. ఇప్పటివరకు డబ్బు కోసం శవాలను మాయం చేసిన రాజు, స్వప్న్, గోల్డీలకు ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడమే కష్టం అవుతుంది. ఒక సమస్య నుంచి బయటపడేందుకు వేసే ప్లాన్ మరో పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. ఇదే సమయంలో వీళ్ల అమాయకత్వం, గొడవలు, చేసే తప్పులు కథకు డార్క్ కామెడీ టచ్‌ను తీసుకొస్తాయి.

Advertisement

మరి ఈ ముగ్గురు మొదలుపెట్టిన విచిత్రమైన బిజినెస్ చివరికి ఎక్కడికి చేరింది ? వీళ్ల వెనుక పడిన గ్యాంగ్‌స్టర్ల నుంచి తప్పించుకున్నారా ? పోలీసులు అసలు నిజాన్ని కనిపెట్టారా ? మొదట ఈజీ మనీ కోసం మొదలు పెట్టిన బిజినెస్ చివరకు వీళ్ల జీవితాలను పూర్తిగా ఎలా మార్చింది ? అనేదే సిరీస్‌లో చూసి తెలుసుకోవలసిన కథ.

తెలుగులోనూ చూడవచ్చా ?

‘క్లీన్ అప్ కంపెనీ సీజన్ 1’ ఆగస్టు 21 నుంచి Amazon MX Playerలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఒకేసారి విడుదలయ్యాయి. విషాల్ జేత్వా, అమేయ్ వాఘ్, అజితేష్ గుప్తా ప్రధాన పాత్రల్లో నటించగా, రవి కిషన్, జిషు సేన్‌గుప్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. క్రైమ్, డార్క్ కామెడీ, గ్యాంగ్‌స్టర్ కథలు నచ్చేవారికి ఈ సిరీస్ మంచి ఆప్షన్. కానీ స్ట్రీమింగ్ తెలుగులో లేదు.

Read Also: గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

Tags

Related News

పిల్లలకు పార్సిల్స్ ఇచ్చే విమానం… కొత్త గ్యాడ్జెట్స్‌తో పిల్లలను ఎంటర్‌టైన్ చేసే ఫాంటసీ అడ్వెంచర్

నాస్తికుడికి దెయ్యం కనిపిస్తే ? కొత్తింట్లో జరిగే క్రైమ్‌తో మైండ్ బ్లోయింగ్ హారర్ థ్రిల్లర్

ఫ్లాప్ సినిమా షూటింగ్‌ కోసం వెళ్తే పుచ్చ పేలిపోయే ట్విస్ట్… ఈ యాక్షన్ కామెడీ అదుర్స్

చచ్చిపోయిన ప్రేమ మళ్లీ తిరిగొస్తే… ఈ లవ్ స్టోరీలో చివరి 20 నిమిషాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది మావా

ప్రజలనే ఆయుధంగా మార్చి దేశాన్ని కూల్చే కుట్ర… విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

పెళ్లయ్యాక భర్తే అత్తారింటికి వెళ్తే… కడుపుబ్బా నవ్వించే ఈ జెన్ జీ రోమ్ కామ్ మూవీ తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

Advertisement
×