E-Paper
Advertisement

కొండా సురేఖ vs కాంగ్రెస్.. టీపీసీసీ చీఫ్, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

కొండా సురేఖ vs కాంగ్రెస్.. టీపీసీసీ చీఫ్, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Konda Surekha Controversy: తెలంగాణలో సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడుతూ.. కొండా సురేఖను గతంలో కాపాడమని ఇప్పుడు కాపాడే ఛాన్సే లేదని తేల్చి చెప్పారు. పార్టీ లైన్ ను ఎవరూ దాటిన చర్యలు తప్పవన్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత లైన్ దాటి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపైనే ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అటు అదిష్టానం సైతం కొండా సురేఖపై సీరియస్ గా ఉందని తేల్చి చెప్పారు.

మరోవైపు ఇదే వివాదంపై గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మాట్లాడారు. కొండా సురేఖ ఇచ్చిన వివరణను పరిశీలించినట్లు చెప్పారు. అటు కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ వీడియోస్ ను సైతం చూసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ ను సాధారణ వ్యక్తిలాగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు మల్లు రవి అన్నారు. అటు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పెట్టిన ప్రెస్ మీట్ ను సైతం పరిశీలించామని.. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ వివాదంపై ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోలేమన్నారు.

Advertisement

అయితే సొంత కూతురు మాట్లాడిన మాటలను కనీసం సురేఖ ఖండించలేదని మల్లు రవి విమర్శించారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తనకు కూతురు చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని మాత్రం ఆమె చెబుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు చిన్నారెడ్డి వివాదం గురించి కూడా మల్లు రవి మాట్లాడారు. విమర్శలపై చిన్నారెడ్డి ఇచ్చిన వివరణ పరిశీలించినట్లు చెప్పారు. మేఘా రెడ్డితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!

Advertisement

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలపైనా మల్లు రవి స్పందించారు. రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. సుమోటోగా తీసుకోవాలా? లేదా? అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మెుత్తం మీదా చిన్నారెడ్డి సీనియర్ నాయకుడు కావడం వల్ల, కొండా సురేఖ మంత్రిగా ఉండటం వల్ల నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యం అవుతోందని మల్లు రవి చెప్పుకొచ్చారు.

Also Read: ప్రజలనే ఆయుధంగా మార్చి దేశాన్ని కూల్చే కుట్ర… విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Tags

Related News

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

హైదరాబాద్‌వాసులపై అధికారులు నిఘా.. ఓ వ్యక్తికి రూ.20 వేల జరిమానా, నీటిని వృథా చేసినందుకు

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

Big Stories

Advertisement
×