E-Paper
Advertisement

ఇమ్మాన్యుయేల్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్.. అసలేం జరిగిందంటే?

ఇమ్మాన్యుయేల్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Emmanuel: ఇటీవలకాలంలో ఎన్నో కామెడీ షోలు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే మరికొన్ని షోలలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి కూడా కామెడీ పండిస్తున్నారు. అయితే ఆ కామెడీ కాస్త బెడిసి కొట్టి ఆయా కమెడియన్స్ కి పెద్ద తలనొప్పిగా మారుతున్న విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి అప్పుడప్పుడు కమెడియన్లు చేసే చిన్న చిన్న స్కిట్లు వారిని విమర్శల పాలు చేస్తూ ఉంటాయి. ఇప్పటికే బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది లాంటి ఎంతోమంది కమెడియన్లు స్టార్ హీరోల మాటలను ఇమిటేట్ చేసి వారి అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.

ఇమ్మాన్యుయేల్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..

అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి ఇమ్మాన్యుయేల్ (Emmanuel) కూడా వచ్చారు. జబర్దస్త్ (Jabardasth) కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన బిగ్ బాస్ లో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ పై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి మెగా అభిమానుల ఆగ్రహానికి ఇమ్మాన్యుయేల్ గురికావడానికి గల కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే.. ఇటీవల రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సన(Bucchi babu Sana) దర్శకత్వంలో పెద్ది సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన పాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Advertisement

ALSO READ:ఇక సెలవు.. ముగిసిన షావుకారు జానకి అంత్యక్రియలు!

అసలేం జరిగిందంటే?

ఇక అందులో “మస్సా మస్సా” పాట కూడా ఒకటి. ఈ పాటను ఇమ్మాన్యుయేల్ చేశారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అలీ, జూనియర్ శ్రీదేవి జడ్జెస్ గా కుకు విత్ జాతి రత్నాలు సీజన్ 2 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ షోలో భాగంగా ఇమ్మాన్యూయేల్ పెద్ది గెటప్ లో మస్సా మస్సా పాటను రీ క్రియేట్ చేశారు. అందులో ఆయన డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా విగ్గు మొత్తం ఊడిపోయింది. అక్కడున్న వారంతా నవ్వారు. పైగా రామ్ చరణ్ డాన్స్ స్టెప్పులను ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఇది చూసిన మెగా అభిమానులు రాంచరణ్ ను ఇమిటేట్ చేశాడని.. ఇమిటేట్ చేసినా పర్వాలేదు. అంత చెత్తగా పెర్ఫార్మ్ చేస్తావా?అంటూ మండిపడుతున్నారు. మొత్తానికైతే రామ్ చరణ్ పెద్ది మూవీ లో పాటను ఇమిటేట్ చేసి ఇప్పుడు మెగా అభిమానుల ఆగ్రహానికి ఇమ్మాన్యూయేల్ గురయ్యాడని చెప్పవచ్చు.

ఇమ్మాన్యూయేల్ సోదరుడు కూడా నటుడే..

Advertisement

ఇమ్మాన్యూయేల్ మాత్రమే కాదు ఈయన సోదరుడు వంశీ నండూరి కూడా ఒక నటుడే కావడం గమనార్హం. గతంలో ఇమ్మాన్యుయేల్ కలిసి పటాస్ వంటి షోలలో సందడి చేసిన మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సమంత సినిమాలో కనిపించి ఆకట్టుకున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సమంత వెనకే ఫాలో అవుతూ.. తరచూ ఆమెతో తిట్టించుకోవడం, పెద్ద గరిటతో కొట్టించుకోవడం, చివరికి ఫైట్ చేయడం లాంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా నటించాడు. ఈయన నటించిన తొలి సినిమానే అయినా తన పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. మొత్తానికైతే అటు ఇమ్మాన్యూయేల్ ఇటు వంశీ ఇద్దరు కూడా నటులుగా స్థిరపడిపోయారు.

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×